Site icon HashtagU Telugu

Mahesh Babu : తండ్రిగా గర్విస్తున్నా.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్

Mahesh Babu

Mahesh Babu

Mahesh Babu : హీరో మహేష్ బాబు కుమారుడు 18 ఏళ్ల గౌతమ్ అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న ఓ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. యూనివర్సిటీ క్యాంపస్‌లో జరిగిన స్నాతకోత్సవానికి మహేష్ బాబు, సతీమణి నమ్రత, కుమార్తె సితార ఘట్టమనేని  హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలను వీరు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు. దీంతో అవి వైరల్ అవుతున్నాయి.

We’re now on WhatsApp. Click to Join

తన కుమారుడు అమెరికాలో గ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేసిన వేళ మహేష్ బాబు ఎమోషనల్ అయ్యారు. గౌతమ్‌ను చూసి తండ్రిగా గర్విస్తున్నానని తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో పేర్కొన్నారు. ‘‘నా హృదయం గర్వంతో ఉప్పొంగుతోంది. గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన గౌతమ్‌కు అభినందనలు. నువ్వు రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నా. నీ కలలను సాకారం  చేసుకునేందుకు ప్రయత్నాన్ని కొనసాగించు’’ అని అంటూ మహేష్ బాబు తన కుమారుడికి పిలుపునిచ్చారు. తన కుమారుడితో దిగిన ఓ ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఇందులో మహేష్ బాబు జీన్ ప్యాంట్, టీ-షర్ట్ ధరించి మంచి లుక్‌లో ఉన్నారు.

ఇక నమ్రత తన కుమారుడు గౌతమ్‌తో దిగిన ఓ ఫొటోను షేర్ చేస్తూ.. ‘‘నా ప్రియమైన జీజీ (గౌతమ్ ఘట్టమనేని).. నువ్వు నీ జీవితపు ఒక కొత్త అధ్యాయంలో ఉన్నావు. నిన్ను చూసి చాలా గర్వంగా ఫీలవుతున్నా. అన్ని విషయాల్లో నిజాయితీగా ఉండు. నీ అభిరుచులను నువ్వు అనుసరించు. నీ కలల సాకారం కోసం నువ్వు ప్రయత్నించు. జీవితం నిన్ను ఏ స్థాయికి తీసుకెళ్లినా నా ప్రేమ, మద్దతు ఎల్లప్పుడూ ఉంటాయి’’ అని నమ్రత రాసుకొచ్చారు.  ఈ పోస్ట్‌లో షేర్ చేసిన ఫొటోలో నమ్రత వైట్ డ్రెస్‌లో ఉన్నారు. ఇక సితార అందమైన ఎరుపు రంగు ఫ్రాక్‌‌లో ఉన్నారు.ఇక మహేష్ బాబు కూతురు సితార ఇన్‌స్టాలో ఓ పోస్ట్ చేస్తూ..  ‘‘మీవింగ్ బాస్ పట్టభద్రుడయ్యాడు’’ అని రాసుకొచ్చింది.

Also Read :Nehru Death Anniversary : నెహ్రూకు ఖర్గే, సోనియా, రాహుల్ ఘన నివాళులు

నమ్రత, మహేష్ బాబులు(Mahesh Babu) 2005 సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2006లో కుమారుడు గౌతమ్ జన్మించాడు. కుమార్తె సితార ఘట్టమనేని 2012లో జన్మించింది.