Site icon HashtagU Telugu

Ira Khan Bikini: బికినీ లో ఐరా ఖాన్ బర్త్ డే సెలబ్రేషన్స్.. నెటిజన్స్ ట్రోల్స్

Ira Khan

Ira Khan

బాలీవుడ్ నటుల్లో అమీర్ ఖాన్ ది ప్రత్యేకమైన శైలి. కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటూ.. వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడంలో ఆయన ముందుంటారు. సినిమాలో ‘మిస్టర్ పర్ఫెక్ట్’ అయిన ఆయన.. బయట మాత్రం తనకు నచ్చినట్టుగా ఉండేందుకు ఇష్టం చూపుతుంటారు. గతంలో ఓ పార్క్ లో తన డాటర్ ఐరా ఖాన్ తో కలిసి ఉన్న ఫొటో ఒకటి వైరల్ గా మారిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. తాజాగా మరోసారి అమీర్ కూతురు వైరల్ గా మారింది.

తన బర్త్ డే సందర్భంగా ఐరా ఖాన్ బికినీలో కేక్ కట్ చేయడం, పక్కన అమీర్ ఖాన్ ఉండటం పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఆ ఫొటోలో ఫ్యామిలీ అంతా కనిపించడంతో నెటిజన్లు భగ్గుమంటున్నారు. ఇది ఇస్లాంకు వ్యతిరేకం కాదా? అసలు మీరు ఇస్లాంకు చెందినవారేనా? ఇలా చేస్తారా? అంటూ రకరకాల కామెంట్లు వస్తున్నాయి. ఇక కొందరు అయితే ఐరా ఖాన్ ను దారుణంగా బూతులు తిడుతున్నారు. మొత్తానికి ఐరా ఖాన్ బికినీ ఫోటోలు, బర్త్ డే సెలెబ్రేషన్స్ మాత్రం నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారాయి.

Exit mobile version