Site icon HashtagU Telugu

Nithiin injured: నితిన్ తమ్ముడు షూటింగ్ కు బ్రేక్.. రీజన్ ఇదే..

Nithiin Injured

Nithiin Injured

Nithiin injured: యంగ్ హీరో నితిన్ తమ్ముడు టైటిల్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి వేణు శ్రీరామ్ డైరెక్టర్. దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తున్నాడు. ఈ మూవీ కోసం ఆంధ్రప్రదేశ్ లోని మారేడుమిల్లిలో కొన్ని యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. అయితే.. యాక్షన్ సీన్స్ చేస్తుంటే.. నితిన్ కి గాయాలు అయ్యాయట. వెంటనే షూటింగ్ క్యాన్సిల్ చేశారు. నితిన్ చేతికి గాయాలు అయ్యాయి.. పరీక్షించిన డాక్లర్లు మూడు వారాలు పాటు రెస్ట్ తీసుకోవాలి అని చెప్పారని సమాచారం.

నితిన్ ఈమధ్య చేసిన సినిమాలు ఆశించినట్టుగా ఆకట్టుకోలేకపోయాయి. ఎక్స్ ట్రా మూవీతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే.. ఆ సినిమా కూడా ఏమాత్రం మెప్పించలేకపోయవడంతో బాక్సాఫీస్ దగ్గర నిరాశే ఎదురైంది. ఇప్పుడు చేస్తోన్న తమ్ముడు సినిమా పై నితిన్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. వేణు శ్రీరామ్.. వకీల్ సాబ్ తర్వాత వెంటనే సినిమా చేయాలని వేరే బ్యానర్స్ లో ట్రై చేశాడు. అలాగే కొంత మంది హీరోలకు కూడా కథ చెప్పాడు కానీ.. ఏదీ సెట్ కాలేదు.

ఫైనల్ గా దిల్ రాజే ప్రాజెక్ట్ సెట్ చేశాడు. అదే.. ఈ తమ్ముడు మూవీ. శ్రీనివాస కళ్యాణం తర్వాత దిల్ రాజు బ్యానర్ లో నితిన్ చేస్తోన్న మూవీ ఇది. నితిన్ పవర్ స్టార్ కు వీరాభిమాని. ఆయన సినిమాల్లో పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ లు ఉంటుంటాయి. ఈసారి ఏకంగా పవన్ కళ్యాణ్ మూవీ టైటిల్ తోనే సినిమా చేస్తుండడం విశేషం. అక్కా, తమ్ముడు అనుబంధం నేపధ్యంలో ఈ సినిమా కథ ఉంటుందని.. కథకు అనుగుణంగానే ఈ టైటిల్ ఫిక్స్ చేశారని మేకర్స్ తెలియచేశారు. మరి… తన అభిమాన హీరో టైటిల్ తో రానున్న ఈ తమ్ముడు సినిమా అయినా.. నితిన్ కి విజయాన్ని అందిస్తుందో లేదో చూడాలి.

Also Read: Nizamabad Mayor: నిజామాబాద్ మేయర్ పీఠంపై కన్నేసిన బీజేపీ

Exit mobile version