Site icon HashtagU Telugu

Hyderabad : సినిమా రంగంలోకి ఇన్ఫినిట‌మ్ పిక్చ‌ర్స్‌

Infinitum Pictures

Infinitum Pictures

ఫిలిం నగర్ లోని జేఆర్సీ కన్వెన్షన్ లో ఇన్ఫినిటమ్ పిక్చర్స్ లాంఛ్ ఘనంగా జరిగింది. యువతలో స్పూర్తిని నింపే యూత్ టాలెంట్ ని ఒకే వేదిక మీదకు ఇన్ఫినిటమ్ తీసుకొచ్చింది. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో సాధించిన విజయాలతో రెట్టించిన ఉత్సాహంతో ఇప్పుడు సినిమా రంగంలో అడుగు పెట్టింది. సెలబ్రెటీస్ సందడి.. ప్రముఖుల బ్లెస్సింగ్ నడుమ పండుగ వాతావరణంలో సినీ ఎంట్రీ గ్రాండ్ లాంచ్‌ చేసింది. ఇందుకు సంబంధించిన భాగస్వామ్య సంస్థలను పరిచయం చేసింది. ఇన్ఫినిటమ్ ఈవెంట్‌కు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు తరలి వచ్చారు. ఇన్ఫినిటమ్ పిక్చర్స్ భాగస్వామ్య సంస్థ నుంచి జాహ్నవి నారంగ్, ఎమ్మెల్యే రఘనందన్ రావు ఇన్ఫినిటమ్‌కి విషెస్ చెప్పారు. ఏషియన్ మూవీతో టై అప్ అయిన ఇన్ఫినిటమ్ జయ క్రిష్ణ ముకుంద మురారీ తొలి మూవీ టైటిల్ ను ఆవిష్కరించారు.

యాంకర్ రవి,అరియా‌ణ ఆద్వర్యంలో ఈవెంట్ కలర్ ఫుల్ అండ్ ఇంట్రస్టింగ్ గా గ్రాండ్ ఫీస్ట్ గా నిలిచింది. ఎంతో మంది యువ కళాకరులను ఈ వేదిక ద్వారా పరిచయం చేసింది. ఇన్ఫినిటమ్ కోర్సులను ఈవెంట్ లో ఆవిష్కరించారు. యూఎస్ లో ఇన్ఫినిటమ్ ఆపరేషన్స్ ను ఇదే ముహూర్తంగా అధికారికంగా లాంఛ్ చేసారు. ట్రిపుల్ ఆర్ మూవీ ఫేం రాహుల్ సిప్లిగంజ్, బేబీ ఫేం వైష్ణవి చైతన్యను సత్కరించారు.  ఇన్ఫినిటమ్ పిక్చర్స్ సభికుల హర్షధ్వానాల మధ్య గ్రాండ్ గా రిలీజ్ చేసారు. స్టూడెంట్ వెబ్ సిరీస్‌ లిరికల్ సాంగ్ రిలిజ్ చేశారు. ఇదే సమయంలో ఇన్ఫినిటమ్ ఏషియన్ భాగస్వామ్యంతో కొనసాగనున్న ప్రణాళికలు..ప్రకటనలను ఈవెంట్ లో ప్రకటించి ఆసక్తిని పెంచారు. ఈ గ్రాండ్ ఫీస్ట్ లో ఇన్ఫినిటమ్ సంస్థ చైర్మన్ వందన బండారు, మేనేజింగ్ డైరక్టర్ సత్యదేవ్ చాడా, సీఈవో రాహుల్‌ రాఘవేంద్ర పాల్గోన్నారు. యూత్ లో మంచి క్రేజ్ ఉన్న షణ్ముక్ జస్వంత్,దీప్తి సునయన,మెహబూబ్ దిల్ సే,సోనియా సింగ్,శ్రీ సత్య,దొర సాయితేజ,విరాజిత,ప్రవళ్లిక దామెర,డాన్ పృధ్వీ,సీతల్ గౌతమన్,వర్ష డిసౌజా ఈ కార్యక్రమంలో సందడి చేశారు.

యువ కళాకారుల అభిరుచులకు ఇన్ఫినిటమ్‌ మార్గదర్శకత్వం వహిస్తోంది. వారి అభిరుచులకు అనుగుణంగా ఎదిగేందుకు వేదికగా నిలుస్తోంది. వారు సక్సెస్ అవ్వటంలో రోల్ మోడల్ గా ఖ్యాతి దక్కించు కుంది. ఇలాంటి ప్రతిభ.. సమర్ధతకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న ఇన్ఫినిటమ్‌ను గెస్టులు మనస్పూర్తిగా అభినందించారు. భవిష్యత్‌లో మరెన్నో సక్సెస్ లకు చిరునామాగా నిలవాలని ఆకాంక్షించారు.