Indraganti For Mahesh: మహేశ్ కోసం ‘ఇంద్రగంటి’ ఎక్సైటింగ్ స్టోరీ

ఇంద్రగంటి మోహన్ కృష్ణ.. టాలీవుడ్‌లో దర్శకులలో ఒకరు. హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా అతని సినిమాలు ప్రేక్షకులను

Published By: HashtagU Telugu Desk
Mahesh

Mahesh

ఇంద్రగంటి మోహన్ కృష్ణ.. టాలీవుడ్‌లో దర్శకులలో ఒకరు. హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా అతని సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే, అతని చివరి చిత్రం ‘వి’ విడుదులకు ముందు హైప్ క్రియేట్ చేసినప్పటికీ, అంతగా ఆకట్టుకోలేదు. ఇంద్రగంటి ఇప్పుడు ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే రొమాంటిక్ డ్రామాతో వస్తున్నాడు. సుధీర్ బాబు, కృతి శెట్టి నటించిన ఈ చిత్రం సినీ ఇండస్ట్రీ నేపథ్యంలో సాగుతుంది.

ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో ఇంద్రగంటి  భవిష్యత్తు ప్రాజెక్ట్‌ల గురించి చాలా వివరాలను వెల్లడించాడు. విజయ్ దేవరకొండతో ఆయన సినిమా కరోనా కారణంగా ఆగిపోయింది. త్వరలో దిల్ రాజు బ్యానర్‌లో విజయ్‌తో సినిమా చేయనున్నట్టు ఆయన వెల్లడించారు. నాగ చైతన్యతో కథ చర్చలు చర్చించుకున్నామని, చైతూ ఆసక్తి చూపలేదన్నాడు. మహేష్ బాబు కోసం ఎక్సైటింగ్ సబ్జెక్ట్ తో రావాలని నమ్రత కోరినట్లు ఇంద్రగంటి వెల్లడించారు. కానీ ఇంద్రగంటి సూపర్‌స్టార్ ఇమేజ్‌కి తగ్గట్టుగా లేదనుకున్నాడు. మహేష్‌కి ఏదో ఎగ్జైటింగ్‌గా కథ కోసం ఎదురు చూస్తున్నాడు. అంతేకాదు.. చిరంజీవి కోసం ఓ కథ రెడీ చేయబోతున్నాడు.

  Last Updated: 15 Sep 2022, 03:19 PM IST