Site icon HashtagU Telugu

Indraganti Mohanakrishna Priyadarshi : అభిరుచిగల దర్శకుడు.. ప్రతిభగల హీరో.. కాంబో సెట్ అయ్యింది..!

Indraganti Mohanakrishna Priyadarshi Combination Movie

Indraganti Mohanakrishna Priyadarshi Combination Movie

Indraganti Mohanakrishna Priyadarshi తెలుగు దర్శకుల్లో అభిరుచి గల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు మోహనకృష్ణ ఇంద్రగంటి. తనదైన శైలిలో ప్రత్యేకమైన సినిమాలు చేస్తూ వస్తున్నారు ఇంద్రగంటి. ఆయన చివరగా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా చేశారు. ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. అయితే లేటెస్ట్ గా ప్రియదర్శితో ఒక సినిమా చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.

సైడ్ రోల్స్, కమెడియన్ గా చేస్తూ ప్రియదర్శి కూడా సోలో లీడ్ సినిమాలు చేస్తున్నాడు. మల్లేశం, బలగం లాంటి సినిమాలు అతనికి సూపర్ క్రేజ్ తీసుకొచ్చాయి. ఓ పక్క కామెడీ ఎంటర్టైనర్ సినిమాల్లో హీరో పక్కన ఇంపార్టెంట్ రోల్ చేస్తూనే మరోపక్క సోలో సినిమాలను చేస్తూ వస్తున్నాడు ప్రియదర్శి.

లేటెస్ట్ గా ఇంద్రగంటి మోహనకృష్ణ సినిమాకు కూడా సైన్ చేశాడు ప్రియదర్శి. ఈ సినిమాను శ్రీదేవి మూవీస్ బ్యానర్ లో శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా కథ ఏంటి మిగతా కాస్టింగ్ పై త్వరలో డీటైల్స్ బయటకు తెలుస్తాయి.

Also Read : Neha Shetty : రాధిక వెనక వాళ్లిద్దరు ఉన్నారా..? నేహా శెట్టి పెద్ద ప్లాన్ తోనే దిగింది..!