Ram Charan : తండ్రీ కొడుకులను ఒకేతెరపై చూడాలనుకునే పర్ఫెక్ట్ కాంబో ‘ఆచార్య’

రాంచరణ్ కొణిదెల... టాలీవుడ్ ఇండస్ట్రీ టాప్ హీరోల్లో ఒకరు. చిరు తనయుడిగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చినా.. ‘‘మగధీర, ద్రువ, రంగస్థలం,’’ లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మ్యాన్ ఆఫ్ మాస్ గా చరణ్ కు పేరుంది.

  • Written By:
  • Updated On - December 1, 2021 / 12:47 PM IST

రాంచరణ్ కొణిదెల… టాలీవుడ్ ఇండస్ట్రీ టాప్ హీరోల్లో ఒకరు. చిరు తనయుడిగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చినా.. ‘‘మగధీర, ద్రువ, రంగస్థలం,’’ లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మ్యాన్ ఆఫ్ మాస్ గా చరణ్ కు పేరుంది. ఒకవైపు హీరోగా రాణిస్తూనే.. నిర్మాణ బాధ్యతలను సమర్థవంతంగా మోస్తున్నారు. చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాకు చరణ్ నిర్మాతగా వ్యవహరించారు. తాజాగా తండ్రితో కలిసిన నటించిన ఆచార్య వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఆర్ఆర్ఆర్, ఆచార్య, శంకర్ (RC15) లాంటి ప్రతిష్టాత్మక సినిమాల్లో భాగం పంచుకున్న మెగా హీరో రాంచరణ్ గురించి…

ఈ రంగంలో నిజంగా 40 ఇయర్స్, 150 చిత్రాలకు పైగా చేసిన వ్యక్తితో నటించమంటే… మా నాన్నతో నటించడం నన్ను భయపెడుతోంది” అని అన్నారు చరణ్. కెరీర్ లో ఎంతోమంది నటులతో కలిసి పనిచేయడం వల్లనో, సినిమా పట్ల ఇష్టమో కానీ ఆయన డెడికేషన్ వెరే లెవల్లో ఉంటుంది. మా నాన్నగారిలాగా, మేకప్ పూర్తి చేసుకుని కారవాన్ నుంచి బయటకి వచ్చేసరికి పూర్తిగా కొత్త వ్యక్తిగా కనిపిస్తారు.

నేను మొదటిసారి ఆచార్యలో కామ్రేడ్ పాత్రలో నటిస్తున్నా. ఇది 40 నిమిషాల పాత్ర. సెకండాఫ్ చాలా బాగుంటుంది. గెస్ట్ పాత్రే అయినా కీలక రోల్ ఉంటుంది. డైరెక్టర్ కొరటాల మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు హ్యాఫీగా ఫీలవుతున్నా. ఇది బహుశాతండ్రీ కొడుకులను చూడాలనుకునే పర్ఫెక్ట్ కాంబో.

2009లో మగధీర బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన రాజమౌళితో ‘ఆర్ఆర్ఆర్’ మళ్లీ వర్క్ చేస్తున్నారు కదా.. ఆయనతో వర్క్ ఎక్స్ పరీయన్స్ ఎలా ఉందనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. సెట్‌లో ఏ నటుడైనా అతని నుంచి చాలా నేర్చుకుంటారు. అది పాత్ర గురించి కావచ్చు, అతని పనితనం గురించికావచ్చు, అంకితభావం గురించి కావచ్చు. ఇదొక లవ్లీ వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్. పాన్ ఇండియాలో నంబర్ వన్ డైరెక్టర్ అని అనుకుంటున్నా. అతనితో మళ్లీ పని చేయడం ఆనందంగా ఉంది.

బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్ర్యం కోసం పోరాడిన అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నా. ఆర్ఆర్ఆర్, ఆచార్య, శంకర్ తో చేసే సినిమాలు మూడు విభిన్నమైనవి. నటుడిగా అది నన్ను చాలా ఉత్తేజపరిచింది. శంకర్ తో పనిచేయడం నిజంగా ఒక మంచి అనుభవం.

నాన్న ప్రారంభించిన ‘బ్లడ్ బ్యాంక్’ ను నేనే పర్యవేక్షిస్తున్నా. అభిమానుల సహకారంతో మరిన్ని సేవలను విస్తరించడానికి ట్రై చేస్తున్నా. కరోనా సమయంలో ఎంతోమందికి మా బ్లండ్ బ్యాంక్ నుంచి రక్తదానం చేశాం. సకాలంలో ప్రాణాలను కాపాడినందకుగానూ గర్వంగా ఉంది.

2007లో “చిరుత”తో అరంగేట్రం చేసినప్పటి నుంచి శంకర్‌తో చేస్తున్న ప్రాజెక్ట్ 15వది మాత్రమే. దీనిపై చరణ్ ఇలా రియాక్ట్ అయ్యారు. “నటుడిగా నన్ను సవాలు చేసే పాత్రల కోసం ఎదురు చూస్తున్నాను. నా లైబ్రరీలో 10 సంవత్సరాల తర్వాత నేను సిగ్గుపడే సినిమా ఏదీ కోరుకోకూడదు. చాలా సెలెక్టివ్‌గా ఉండాలనేది నా ప్రధాన ఆలోచన’’ అని రామ్ చరణ్ అన్నారు.