Site icon HashtagU Telugu

Indian Movie : రేపటి నుండి నెట్ ఫ్లెక్సీ లో ‘భారతీయుడు’ స్ట్రీమింగ్

Indian Movie

Indian Movie

టైటిల్ చూసి అదేంటి మొన్ననే విడుదలైంది కదా..అంత త్వరగా స్ట్రీమింగ్ కావడం ఏంటి అనుకుంటున్నారా..? ఇక్కడ ఒకటి గమనించాలి.. నెట్ ఫ్లెక్సీ లో స్ట్రీమింగ్ కాబోయేది భారతీయుడు 2 (Indian 2) కాదు 1996 లో వచ్చిన భారతీయుడు. కమల్ హాసన్ – శంకర్ కలయికలో ఏ ఆర్ రెహమాన్ సంగీత సారథ్యంలో వచ్చిన ‘భారతీయుడు’ (Indian Movie) మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో తెలియంది కాదు చందు , సేనాపతి గా కమల్ నట విశ్వరూపం చూపించాడు. విడుదలైన అన్ని భాషల్లో ఈ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకోవడమే కాదు కలెక్షన్స్ వర్షం కురిపించింది. అలాంటి సినిమా కు సీక్వెల్ గా వచ్చిన భారతీయుడు 2 మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది.

We’re now on WhatsApp. Click to Join.

మొదటి రోజు మొదటి ఆట తోనే నెగిటివ్ టాక్ సొంతం చేసుకొని అభిమానులను నిరాశకు గురిచేసింది. సినిమా టాక్ మూలంగా కలెక్షన్స్ కూడా బాగా డ్రాప్ అవుతున్నాయి. ఈ క్రమంలో నెట్ ఫ్లెక్సీ ‘భారతీయుడు’ సినిమాను రేపు (జులై 15) నుండి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఎలాగూ భారతీయుడు 2 బాగోలేదంటున్నారు కాబట్టి ఖచ్చితంగా భారతీయుడు కొంతమందైనా వెతుక్కుని చూస్తారు. వాళ్లని క్యాష్ చేసుకుందామనేది నెట్ ప్లిక్స్ ఐడియా. ఇక ఇప్పుడు ఇండియన్-2 సినిమాను అర్థం చేసుకోవాలంటే తొలుత ఇండియన్ సినిమాను చూడాల్సిందే అని ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ అంటోంది. మరి భారతీయుడు ను ఎంత మంది చూస్తారో చూడాలి.

Read Also  : Black Thread: కాలికి నల్ల దారం ఎందుకు కట్టుకుంటారో మీకు తెలుసా?