Tabu : హాలీవుడ్ సూపర్ హిట్ సిరీస్‌లోకి టబు ఎంట్రీ.. ‘డూన్’ ప్రీక్వెల్‌లో ముఖ్య పాత్ర..

హాలీవుడ్ సూపర్ హిట్ సిరీస్‌లో నటించే అవకాశం అందుకున్న టబు. 'డూన్' ప్రీక్వెల్‌లో ఓ ముఖ్య పాత్ర..

Published By: HashtagU Telugu Desk
Indian Actress Tabu Selected For A Key Role In Dune Prophecy Movie

Indian Actress Tabu Selected For A Key Role In Dune Prophecy Movie

Tabu : నేషనల్ అవార్డు విన్నర్ టబు సూపర్ హిట్ హాలీవుడ్ సిరీస్ లో ఓ ముఖ్య పాత్ర చేసే అవకాశం అందుకున్నారట. హాలీవుడ్ లో తెరకెక్కిన రీసెంట్ ఫ్యూచరిస్టిక్ మూవీ ‘డూన్’. రెండు భాగాలుగా రూపొందిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రిలీజయ్యి సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ మూవీ సెకండ్ పార్ట్ ఇటీవలే రిలీజయ్యింది. ఇక ఈ రెండు భాగాలు సూపర్ హిట్ అవ్వడంతో.. మేకర్స్ ఈ సిరీస్ లో మరికొన్ని సినిమాలు తీసుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

ఈక్రమంలోనే డూన్ కి ప్రీక్వెల్ గా ‘డూన్ : ప్రోఫేసీ’ని తీసుకు రాబోతున్నారు. ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర కోసం మేకర్స్ టబుని ఎంపిక చేసుకున్నారట. ఈ సినిమాలో సిస్టర్ ఫ్రాన్సెస్కా రోల్ లో టబు కనిపించబోతున్నారు. కాగా టబు హాలీవుడ్ సినిమాల్లో నటించడం ఇదేమి మొదటిసారి కాదు. గతంలో కూడా కొన్ని సినిమాల్లో నటించారు. హనుమాన్, ది నామేసకే, లైఫ్ ఆఫ్ పై వంటి ఇంగ్లీష్ సినిమాల్లో టబు నటించారు.

అయితే ఈ మూడు చిత్రాలు.. ఇండియన్ ఆరిజిన్ తో ఆడియన్స్ ముందుకు వచ్చినవే. కానీ డూన్ సినిమా.. ఇప్పుడు కంప్లీట్ హాలీవుడ్ మూవీగా రాబోతుంది. మరి ఈ సినిమాలో టబు చేయబోయే పాత్ర ఆడియన్స్ ని ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయట. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టనున్నారు. మరి ఈ ప్రీక్వెల్ ఆడియన్స్ ని ఎంతలా ఆకట్టుకుంటుందో చూడాలి.

  Last Updated: 14 May 2024, 12:32 PM IST