Kamal Hassan కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో సినిమా అంటే అది ట్రెండ్ సెట్టర్ అన్నట్టే లెక్క. ఇద్దరు కలిసి చేసిన భారతీయుడు సినిమా అప్పట్లోనే సంచలనాలు సృష్టించింది. అయితే దాదాపు పాతికేళ్ల తర్వాత మళ్లీ ఇండియన్ 2 అంటూ ఆ సినిమా సీక్వెల్ మొదలు పెట్టారు. ఇన్నేళ్ల తర్వాత వస్తున్న ఇండియన్ 2 మీద అదే రేంజ్ అంచనాలు ఉన్నాయి.
శంకర్ డైరెక్షన్ లో సినిమా అంటే బ్లాక్ బస్టర్ హిట్ అనే టాక్ ఉంది. ఐతే ఈమధ్య ఆయన సినిమాలు బాక్సాఫీస్ రేసులో వెనకపడుతున్నాయి. ఇండియన్ 2 తో మరోసారి తన స్టామినా ప్రూవ్ చేయాలని చూస్తున్నారు.
అసలైతే ఇండియన్ 2 సినిమా ఎప్పుడో మొదలవగా మధ్యలో కొన్ని అనివార్య కారణాల వల్ల ఆపేశారు. అయితే విక్రం తో తిరిగి ఫాం లోకి వచ్చిన కమల్ ఇండియన్ 2 ని కూడా పూర్తి చేయాలని పట్టుబట్టాడు. ఇదిలాఉంటే ఇండియన్ 1 నుంచి ఇండియన్ 2 కి పాతికేళ్లు టైం తీసుకున్న శంకర్ ఇండియ 2 నుంచి ఇండియన్ 3 అంటే దానికి కొనసాగింపుని మాత్రం వెంటనే చేస్తున్నాడని తెలుస్తుంది.
ఇండియన్ 2 తో పాటు ఇండియన్ 3 పోర్షన్స్ కూడా కొన్ని పూర్తి చేశారని తెలుస్తుంది. ఇండియన్ 2 సినిమాను జూన్, జూలైలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఆ సినిమా లోనే ఇండియన్ 3 గ్లింప్స్ వదులుతారని తెలుస్తుంది. ఇండియన్ 2 సినిమా కోసం వస్తే ఇండియన్ 3 కూడా చూపించేందుకు శంకర్ సిద్ధం అవుతున్నారు.
ఇది నిజంగానే కమల్ హాసన్ ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ అని చెప్పొచ్చు. మరోపక్క శంకర్ రాం చరణ్ తో గేమ్ చేంజర్ చేస్తుండగా కమల్ హాసన్ మణిరత్నంతో థగ్ లైఫ్ సినిమా చేస్తున్నాడు.
Also Read : Pooja Hegde Summer Treat : సమ్మర్ వేడి మరింత పెంచేస్తున్న బుట్ట బొమ్మ..!