Site icon HashtagU Telugu

Indian 2 : పుష్ప 2 డేట్ పై కన్నేసిన ఆ సూపర్ హిట్ సీక్వెల్..?

Indian 2 Release Date

Indian 2 Release Date

Indian 2 అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప 2 ఆగష్టు 15 రేసు నుంచి తప్పుకుంది. సినిమా అవుట్ పుట్ తను అనుకున్నట్టుగా రాకపోవడంతో సుకుమార్ ఇంకాస్త టైం అడిగినట్టు తెలుస్తుంది. ఇష్టం లేకపోయినా చేసేది లేక సినిమాను డిసెంబర్ 6కి వాయిదా వేసుకున్నారు. పుష్ప 2 వస్తుందని అనుకుని సినిమా ఆ డేట్ కి రిలీజ్ ఆపిన సినిమాలు ఇప్పుడు ఆ డేట్ న వచ్చే ప్లాన్ చేస్తున్నాయి.

ఇప్పటికే డబుల్ ఇస్మార్ట్ సినిమా ఆగష్టు 15న రిలీజ్ అనౌన్స్ చేశారు. పుష్ప 2 వాయిదా పడుతుందని వార్త ముందే తెలుసుకున్న డబుల్ ఇస్మార్ట్ టేం రిలీజ్ డేట్ ప్రకటించారు. ఇక ఇప్పుడు అదే డేట్ న శంకర్ కమల్ హాసన్ కలిసి చేసిన సూపర్ హిట్ సీక్వెల్ ఇండియన్ 2 కూడా వస్తుందని తెలుస్తుంది.

అసలైతే సినిమాను జూలైలో రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ ఇండిపెండెన్స్ డే నాడు అయితే సినిమాకు ఇంకాస్త కలిసి వస్తుందనే ఆలోచనతో ఆగష్టు 15న సినిమా రిలీజ్ అనుకుంటున్నారట. త్వరలోనే ఆ డేట్ ని కన్ ఫర్మ్ చేస్తారని తెలుస్తుంది. శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఇండియన్ 2 సినిమాలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ లు కూడా నటించారు. ఇండియన్ 2 మాత్రమే కాదు ఇండియన్ 3 సినిమాను కూడా ప్లాన్ చేస్తున్నారు శంకర్.

Also Read : Rashmika Mandanna : రష్మిక 13 కోట్లు.. ఈసారి నమ్మేయొచ్చా..?