Rakul Preet Singh: ఇండియన్ 2 నా కెరీర్ లో స్పెషల్ మూవీస్ లో ఒకటి: రకుల్ 

  • Written By:
  • Publish Date - June 8, 2024 / 09:57 PM IST

Rakul Preet Singh: విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన ‘భారతీయుడు 2′ జూలై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. శంకర్ దర్శకత్వంలో 1996లో వచ్చిన కోలీవుడ్ ఇండస్ట్రీ హిట్ ఇండియన్ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. తమిళంలో ఈ యాక్షన్ థ్రిల్లర్ కు సాలిడ్ బజ్ ఉంది. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ సహా భారీ తారాగణం నటిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన పాత్ర గురించి మాట్లాడింది.

రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ “ఇండియన్ 2 నా కెరీర్ లో స్పెషల్ మూవీస్ లో ఒకటి. దానికి జత చేసిన పెద్ద పేర్ల వల్ల కాదు, నా క్యారెక్టరైజేషన్ రాసుకున్న విధానం ప్రత్యేకం. తనకేం కావాలో బాగా తెలిసిన ఆత్మవిశ్వాసం ఉన్న అమ్మాయిగా నటిస్తున్నా. భారతీయుడు 2లో నా పాత్రకు, నా వ్యక్తిగత జీవితానికి చాలా పోలికలు ఉన్నాయి. ప్రస్తుతానికి అంతకుమించి వెల్లడించలేను’ అని పేర్కొన్నారు. మాస్టర్ కథకుడు శంకర్ తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని రకుల్ తెలిపింది.