Site icon HashtagU Telugu

Indian 2 : భారతీయుడు 2 అసలు ఏం జరుగుతుంది..?

Indian 2 What is Going On Shankar Kamal Hassan

Indian 2 What is Going On Shankar Kamal Hassan

Indian 2 కమల్ హాసన్ హీరోగా శంకర్ డైర్క్షన్ లో తెరకెక్కుతున్న క్రేజీ సినిమా భారతీయుడు 2. పాతికేళ్ల క్రితం రిలీజైన సూపర్ హిట్ సినిమా ఇండియన్ కు సీక్వెల్ గా ఇది వస్తుంది. ఐతే ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. కమల్ హాసన్, శంకర్ దాదాపు 3, 4 ఏళ్లుగా ఈ సినిమా కోసం తమ టైం కేటాయించారు.

ఎలాగోలా సినిమా పూర్తి చేసి జూలై 12న రిలీజ్ లాక్ చేశారు. ఐతే ఎందుకో ఏమో కానీ సినిమాపై అంత ఇంపాక్ట్ ఏర్పడలేదు. సినిమా నుంచి ఈమధ్యనే ఒక ట్రైలర్ రిలీజ్ చేయగా అది కాస్త నిరాశపరచింది. శంకర్ మార్క్ ఎలివేషన్స్, టేకింగ్ ఉన్నా ఎందుకో తేడా కొడుతుందని అనిపించింది.

శంకర్ సక్సెస్ అయ్యి కమల్ ఫెయిల్ అయినా.. కమల్ హిట్ట్ అయ్యి శంకర్ ఫెయిల్ అయినా ఆ ఎఫెక్ట్ సినిమా మీద పడుతుంది. జూలై 12న సినిమా రిలీజ్ అంటే మరో వారం లో రిలీజ్ ఉంది. కానీ సినిమాపై ఎలాంటి బజ్ లేదు. అంతేకాదు పాన్ ఇండియా రిలీజ్ అవుతున్న ఈ సినిమా గురించి అసలు ఆడియన్స్ కూడా అంత ఎంగేజింగ్ గా లేరని తెలుస్తుంది. మరి సినిమా రిలీజ్ అయ్యాక అయినా పరిస్థితి మారుతుందేమో చూడాలి.