Site icon HashtagU Telugu

Grammy Awards : జాకిర్ హుస్సేన్, శంకర్ మహదేవన్‌లకు గ్రామీ అవార్డులు

Grammy Awards

Grammy Awards

Grammy Awards : అమెరికాలోని లాస్‌ఏంజిల్స్‌ వేదికగా 66వ ‘గ్రామీ అవార్డుల’ వేడుక సందడిగా జరిగింది.  ఈ వేడుకలో భారతీయులు కూడా మెరిశారు.  ‘ఉత్తమ కంటెంపరరీ ఇన్‌స్ట్రుమెంటల్ ఆల్బమ్’ కేటగిరిలో  బెలా ఫెక్, జాకిర్ హుస్సేన్, ఎడ్గార్ మెయర్‌లను గ్రామీ వరించింది. ‘యాజ్ వీ స్పీక్’ పేరుతో రూపొందించిన ఈ ఆల్బమ్‌లో రాకేష్ చౌరాసియాను ఫీచర్ చేశారు.  ‘గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్’ కేటగిరిలో ‘శక్తి – దిస్ మూమెంట్’కు గ్రామీ దక్కింది. ‘శక్తి – దిస్ మూమెంట్’ ఆల్బమ్ మేకింగ్‌లో శంకర్ మహదేవన్, వయొలినిస్ట్ ఎల్. శంకర్, విక్కు వినాయక్రం సభ్యులుగా ఉన్నారు.‘గ్లోబల్ మ్యూజిక్ కన్సర్ట్’ కేటగిరిలో జాకిర్ హుస్సేన్, బెలా ఫెక్, ఎడ్గార్ మెయర్‌‌లకు గ్రామీ దక్కింది. ఈ ప్రతిష్టాత్మక మ్యూజిక్ అవార్డ్ షో‌కు ట్రెవర్ నోహ్ హోస్ట్‌గా వ్యవహరించారు. పలువురు టాప్ ఆర్టిస్టులు వేదికపై లైవ్ ఫర్ఫార్మెన్స్‌ చేసి అదరగొట్టారు. విజేతల జాబితా ప్రకటించగానే అరుపులు, కేకలతో వేదిక హోరెత్తింది. విజేతలు ఒక్కొక్కరుగా అవార్డులను(Grammy Awards) అందుకున్నారు.

We’re now on WhatsApp. Click to Join

అవార్డుల జాబితా ఇదీ.. 

ర్యాప్ ఆల్బమ్ మైఖేల్ – కిల్లర్ మైక్
ఉత్తమ ఆఫ్రికన్ సంగీత ప్రదర్శన టైలా – వాటర్
పాప్ డ్యుయో / గ్రూప్ ప్రదర్శన ఎస్‌జెడ్‌ఎ, ఫోబి బ్రిడ్జర్స్ – ఘోస్ట్ ఇన్ ద మెషిన్
మ్యూజిక్ వీడియో ది బీటిల్స్, జోనథన్ క్లైడ్, ఎమ్ కూపర్ – ఐయామ్ ఓన్లీ స్లీపింగ్
గ్లోబల్ మ్యూజిక్ ప్రదర్శన జాకిర్ హుస్సేన్, బెలా ఫెక్, ఎడ్గార్ మెయర్ – పష్టో
ఆల్టర్నేటివ్ మ్యూజిక్ ఆల్బమ్ బాయ్‌జెనియస్ – ద రికార్డ్
గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ శక్తి – దిస్ మోమెంట్
ఉత్తమ నిర్మాత, నాన్-క్లాసికల్ జాక్ ఆంటోనాఫ్
ఉత్తమ నిర్మాత, క్లాసికల్ ఎలైన్ మార్టోన్
ఉత్తమ ఇంజనీర్డ్ ఆల్బమ్, క్లాసికల్ రికార్డో ముటి & సింఫోనీ ఆర్కెస్ట్రా – కంటెంపరరీ అమెరికన్ కంపోజర్స్
ఉత్తమ బ్లూగ్రాస్ ఆల్బమ్ మొల్లీ టర్టల్ & గోల్డెన్ హైవే – సిటీ ఆఫ్ గోల్డ్
ఉత్తమ కంటెంపరరీ ఇన్‌స్ట్రుమెంటల్ ఆల్బమ్ బెలా ఫెక్, జాకిర్ హుస్సేన్, ఎడ్గార్ మెయర్, ఫీచరింగ్ రాకేష్ చౌరాసియా – ఆస్ వీ స్పీక్
ఉత్తమ జాజ్ ఇన్‌స్ట్రుమెంటల్ ఆల్బమ్ బిల్లీ చైల్డ్స్ – ద విండ్స్ ఆఫ్ చేంజ్
ఉత్తమ జాజ్ ప్రదర్శన సమారా జాయ్ – టైట్
ఉత్తమ ప్రోగ్రెసివ్ ఆర్‌అండ్‌బీ ఆల్బమ్ ఎస్‌జెడ్‌ఎ – ఎస్‌ఓఎస్
ఉత్తమ ఆర్‌అండ్‌బీ ప్రదర్శన కోకో జోన్స్ – ఐసీయూ
ఉత్తమ కంటెంపరరీ క్లాసికల్ కంపోజిషన అవదాగిన్ ప్రాట్, ఎ ఫార్ క్రై & రూమ్‌ఫుల్ ఆఫ్ టీత్ – మాంట్‌గోమెరీ: రౌండ్స్
ఉత్తమ క్లాసికల్ కంపెండియం వివిధ కళాకారులు – పాషన్ ఫర్ బాక్ అండ్ కోల్‌ట్రేన్
ఉత్తమ క్లాసికల్ సోలో వోకల్ ఆల్బమ్ జూలియా బుల్లాక్, సోలోయిస్ట్, క్రిస్టియన్ రీఫ్, కండక్టర్ (ఫిల్హార్మోనియా ఆర్కెస్ట్రా) – వాకింగ్ ఇన్ ద డార్క్
ఉత్తమ క్లాసికల్ ఇన్‌స్ట్రుమెంటల్ సోలో లూయిస్‌విల్ ఆర్కెస్ట్రా – ది అమెరికన్ ప్రాజెక్ట్
ఉత్తమ పాప్ సోలో ప్రదర్శన మైలీ సైరస్ – ఫ్లవర్స్
ఉత్తమ ఫోక్ ఆల్బమ్ జోని మిచెల్ – జోని మిచెల్ ఎట్ న్యూపోర్ట్
ఉత్తమ గేయరచయిత, నాన్-క్లాసికల్ థిరాన్ థామస్
ఉత్తమ డ్యాన్స్/ఎలక్ట్రానిక్ రికార్డింగ్ స్క్రిల్లెక్స్, ఫ్రెడ్ ఎగైన్….అండ్ ఫ్లోడన్ – రంబుల్
ఉత్తమ పాప్ డ్యాన్స్ రికార్డింగ్ కైలీ మినోగ్ – పదం పదం
ఉత్తమ డ్యాన్స్/ఎలక్ట్రానిక్ మ్యూజిక్ ఆల్బమ్ ఫ్రెడ్ ఎగైన్.. ఆక్చువల్ లైఫ్ 3 (జనవరి 1- సెప్టెంబర్ 9 2022)
ఉత్తమ సాంప్రదాయ ఆర్‌అండ్‌బీ ప్రదర్శన పిజే మోర్టన్ ఫీచరింగ్ సూసన్ కారోల్ – గుడ్ మార్నింగ్
ఉత్తమ ఆర్‌అండ్‌బీ ఆల్బమ్ విక్టోరియా మొనెట్ – జాగ్వార్ II
ఉత్తమ మెలోడిక్ ర్యాప్ ప్రదర్శన లిల్ డర్క్ ఫీచరింగ్ జే కోల్ – ఆల్ మై లైఫ్
ఉత్తమ ర్యాప్ సాంగ్ కిల్లర్ మైక్ ఫీచరింగ్ ఆండ్రే 3000, ఫ్యూచర్ అండ్ ఎరిన్ అలెన్ కేన్ – సైంటిస్ట్స్ & ఇంజనీర్స్
ఉత్తమ కంట్రీ సోలో ప్రదర్శన క్రిస్ స్టేప్లెటన్ – వైట్ హార్స్
ఉత్తమ కంట్రీ సాంగ్ క్రిస్ స్టేప్లెటన్ – వైట్ హార్స్
విజువల్ మీడియాకు రాసిన ఉత్తమ సాంగ్ బార్బీ ది ఆల్బమ్ నుంచి నేను ఎందుకు తయారైనాను?, బిల్లీ ఐలిష్ ఒ’కానెల్ మరియు ఫిన్నియస్ ఒ’కానెల్, గేయ రచయితలు (బిల్లీ ఐలిష్)
ఉత్తమ కామెడీ ఆల్బమ్ డేవ్ చాపెల్ – వాట్స్ ఇన్ ఎ నేమ్?
ఉత్తమ మ్యూజికల్ థియేటర్ ఆల్బమ్ సమ్ లైక్ ఇట్ హాట్
ఉత్తమ రాక్ ఆల్బమ్ పారామోర్ – దిస్ ఇజ్ వై
ఉత్తమ రాక్ సాంగ్ బాయ్‌జెనియస్ – నాట్ స్ట్రాంగ్ ఎనఫ్
ఉత్తమ మెటల్ ప్రదర్శన మెటాలికా – 72 సీజన్స్
ఉత్తమ రాక్ ప్రదర్శన బాయ్‌జెనియస్ – నాట్ స్ట్రాంగ్ ఎనఫ్
ఉత్తమ కంట్రీ డ్యుయో/గ్రూప్ ప్రదర్శన జాక్ బ్రయాన్ ఫీచరింగ్ కేసీ మస్‌గ్రేవ్స్ – ఐ రిమెంబర్ ఎవ్రీథింగ్

Also Read : FIFA World Cup : ఫిఫా వరల్డ్ కప్‌ ఫైనల్‌‌కు ఆతిథ్యమిచ్చే నగరమదే.. షెడ్యూల్ ఇదీ