Site icon HashtagU Telugu

Chiru & Sreemukhi Promo: మేఘాల్లో మెగాస్టార్.. చిరంజీవితో శ్రీముఖి రచ్చ రచ్చ!

Godfather

Godfather

గాడ్ ఫాదర్ ఆల్ టైమ్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీకి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార, సత్యదేవ్, సునీల్, సముద్రఖని లాంటి నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్ , సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్‌లపై ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్ ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. గాడ్ ఫాదర్ ఈ ఏడాది అక్టోబర్ 5న దసరా కానుకగా తెలుగు, హిందీలో గ్రాండ్ గా విడుదల కానుంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన థార్ మార్ పాటకు బిగ్ రెస్పాన్స్ వస్తోంది. ప్రీరిలీజ్ ను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో గాడ్ ఫాదర్ టీం మూవీ ప్రమోషన్స్ జోరు పెంచింది. తాజాగా ‘క్లౌడ్ విత్ మెగాస్టార్’ ప్రోమో వైరల్ గా మారింది. మెగాస్టార్ చిరంజీవిని యాంకర్ శ్రీముఖి ఫ్లయిట్ లో ఇంటర్వ్యూ చేసింది. గాడ్ ఫాదర్ లుక్ చిరు హాట్ గా ఉన్నారంటూ శ్రీముఖి రియాక్ట్ అవ్వగా, మెగాస్టార్ తనదైన స్టయిల్ లో సమాధానమిచ్చారు. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, నయనతార లాంటి వాళ్ల ఆసక్తికర విషయాలను చిరంజీవి తెలియజేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో ఆకట్టుకుంటుంది.

Exit mobile version