Nayanthara-Vignesh Pics: తారలు దిగివచ్చిన వేళ!

నటి నయనతార, నిర్మాత విఘ్నేష్ శివన్ పెళ్లి అంగరంగవైభవంగా జరిగింది.

Published By: HashtagU Telugu Desk
Nayan3

Nayan3

నటి నయనతార, నిర్మాత విఘ్నేష్ శివన్ పెళ్లి అంగరంగవైభవంగా జరిగింది. ఈ జంట ఉదయం 9.30 గంటలకు వివాహం చేసుకున్నారు. ఈ వేడుకకు సూపర్ స్టార్ రజనీకాంత్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. దర్శకుడు అట్లీ, జవాన్‌లో నయనతారతో జతకట్టబోతున్న నటుడు షారూఖ్ ఖాన్ కూడా పెళ్లిలో కనిపించారు. పెళ్లికి సంబంధించిన ఫోటోలను నయతార మేనేజర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.  బ్లాక్ సన్ గ్లాసెస్‌తో ఆల్-బీజ్ ఎన్‌సెంబ్ల్‌ను ధరించి, షారూఖ్ ఖాన్ స్టైలిష్ లుక్‌లో కనిపించాడు. షారుఖ్ ఖాన్, అట్లీల వివాహానికి సంబంధించిన ఫోటోలు కూడా ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారాయి. అట్లీ నెహ్రూ జాకెట్‌తో పాస్టెల్ ఆకుపచ్చ కుర్తా ధరించి కనిపిస్తాడు.

వివాహానికి హాజరైన ఇతర ప్రముఖుల ఫోటోలు కూడా ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారాయి. నటులు కార్తీ , వసంత్ రవి, నిర్మాత బోనీ కపూర్, తలైవి ఫేమ్ దర్శకుడు విజయ్ మరియు టెలివిజన్ హోస్ట్ దివ్య ధరిణి (DD) అటెండ్ అయ్యారు. నటుడు కార్తీ స్కై బ్లూ కుర్తాలో, బోనీ కపూర్ పాస్టెల్ పసుపు కుర్తాలో కనిపిస్తుండగా, దివ్య ధరిణి సాంప్రదాయ సాల్మన్ పింక్ దుస్తులలో కనిపించింది. మొతానికి నయన్, విఘ్నేష్ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది.

  Last Updated: 09 Jun 2022, 03:18 PM IST