IMDB : ప్రపంచంలోని అత్యంత ప్రాచుర్యం పొందిన, అధికారిక వనరు అయిన IMDB 2024లో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన 10 భారతీయ సినిమాలను ప్రకటించింది. IMDB వార్షిక జాబితాలు ప్రపంచవ్యాప్తంగా IMDBకి 250-మిలియన్లకు పైగా నెలవారీ విజిటర్స్ ఆధారంగా ఉంటాయి.
“IMDB మోస్ట్ పాపులర్ ఇండియన్ మూవీస్ ఆఫ్ 2024 జాబితాలు సంవత్సరపు టైటిల్స్ సెలబ్రేట్ చేయడమే కాకుండా, వీక్షకుల ప్రాధాన్యతలను కూడా తెలియజేస్తాయి. కంటెంట్ క్రియేటర్స్ మరియు అభిమానులకు వారి ఇష్టమైన వాటిని సెలెక్ట్ చేసుకోవడంలో ఒక మార్గనిర్దేశం చేస్తాయి” అని ఐఎండిబి ఇండియా హెడ్ యామిని పటోడియా అన్నారు. నెం.1 మూవీ కల్కి 2898-ఏడీ వంటి భారీ బడ్జెట్ చిత్రాల నుంచి నెం.10 మూవీ లాపటా లేడీస్ వంటి ఆకట్టుకునే డ్రామాల వరకు, ప్రియమైన ఫ్రాంచైజీల నుండి అద్భుతమైన ఒరిజినల్ సిరీస్ వరకు, ఈ జాబితా ఈ సంవత్సరంలో ప్రపంచ ప్రేక్షకులను ఆకర్షించిన భారతీయ కథలలోని విస్తృతిని ప్రదర్శిస్తాయి.
కల్కి 2898-ఏడీ 2024లో నెంబర్ వన్ ర్యాంక్ పొందిన మూవీ దర్శకుడు నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. “కల్కి 2898-ఏడీ 2024 మోస్ట్ పాపులర్ ఇండియన్ మూవీగా నిలవడం నిజంగా అద్భుతం. ఓపెన్ హార్ట్స్ తో సినిమాను ఆదరించిన అద్భుతమైన ప్రేక్షకుల ప్రేమకు, మద్దతుకు ఈ గుర్తింపు నిదర్శనం. మా హృదయాన్ని ఈ సినిమాలో పోశామని, ప్రపంచవ్యాప్తంగా అన్ని వయసుల వారికీ ప్రతిధ్వనించే ఈ చిత్రం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ ప్రయాణాన్ని చిరస్మరణీయం చేసిన ఐఎండీబీకి, అభిమానులకు ధన్యవాదాలు. మీ ప్రోత్సాహం మమ్మల్ని మా కథలను మరింత లోతుగా ఆలోచించేలా ప్రేరేపిస్తుంది” అన్నారు.
ఐఎండీబీ 2024 టాప్ 10 మోస్ట్ పాపులర్ ఇండియన్ మూవీస్
1. కల్కి 2898- AD
2. స్త్రీ 2: సర్కతే కా ఆటంక్
3. మహారాజా
4. షైతాన్
5. ఫైటర్
6. మంజుమెల్ బాయ్స్
7. భూల్ భులైయా 3
8. కిల్9. సింగం ఎగైన్
10. లాపటా లేడీస్
జాబితాల గురించి అదనపు సమాచారం:
ఐఎండిబి మోస్ట్ పాపులర్ ఇండియన్ మూవీస్ ఆఫ్ 2024 జాబితాలో ఏడు హిందీ చిత్రాలు ఉన్నాయి. తరువాత తెలుగు (కల్కి 2898-A.D), తమిళం (మహారాజా), మలయాళం (మంజుమ్మెల్ బాయ్స్) ఉన్నాయి. స్త్రీ 2: సర్కతే కా ఆటంక్, భూల్ భులైయా 3, మరియు సింగం ఎగైన్ అనే మూడు హై-ప్రొఫైల్ సీక్వెల్స్ స్థాపించబడిన ఫ్రాంచైజీలు నిరంతర ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నది.
ఫైటర్, కల్కి 2898- A.D, సింగం ఎగైన్ అనే మూడు చిత్రాల్లో దీపికా పదుకొణె నటించింది. ఇటీవల ప్రకటించిన ఐఎండీబీ మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్స్ ఆఫ్ 2024 జాబితాలో ఆమె నెం.2 స్థానంలో నిలిచింది. వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న 97వ ఆస్కార్ అవార్డ్స్ లో ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో లపాటా లేడీస్ (నెం.10) భారతదేశపు అఫీషియల్ ఎంట్రీ. కిల్, గ్యారా గ్యారాతో అత్యంత ప్రజాదరణ పొందిన సినిమాలు నటించిన ఏకైక నటుడు రాఘవ్ జుయాల్.
Read Also: Year Ender 2024 : 2024లో భారతీయులు ఈ విషయాల గురించి గూగుల్‌లో సెర్చ్ చేశారు..!