Site icon HashtagU Telugu

Samantha: నీ విషయంలో నేను ఎంతో గర్వంగా ఉన్నా: సమంత

Samantha Saaki Photoshoot June2021 16x

Samantha Saaki Photoshoot June2021 16x

Samantha: టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా ఉన్న సమంత.. ఇప్పుడిప్పుడు సాధారణ స్థితికి వస్తున్నట్లు తెలుస్తోంది. నాగచైతన్య నుండి విడిపోయిన తర్వాత హీరోయిన్ సమంత.. వయోసైటిస్ అనే వ్యాధి బారిన పడటం తెలిసిందే. ఆమె ఆ వ్యాధి బారినపడ్డప్పుడు తీవ్ర అనారోగ్యానికి గురైందని, కనీసం నడవడానికి కూడా వీలుపడలేదని అందరికీ తెలిసిందే. ఒంటరిగా తనకు తాను ధైర్యం చెప్పుకున్న సమంత.. ఇప్పుడు తిరిగి షూటింగ్ లలో బిజీగా ఉంటోంది.

హీరోయిన్ సమంత ప్రస్తుతం గుణశేఖర్ తో కలిసి ‘శాకుంతలం’ సినిమా షూటింగ్ చేస్తుండగా.. ‘సిటాడెల్’ కోసం తిరిగి బిజీగా అయిపోయింది. తనకు వచ్చిన మయోసైటిస్ కు చికిత్స తీసుకున్న హీరోయిన్ సమంత.. దాని నుండి పూర్తిగా కోలుకోగా.. ఆమె మాల్దీవుల్లో బికినీ మీద సూర్యరశ్మి తగిలేలా యోగాసనాలు చేయగా.. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి.

అయితే తాజాగా సమంత తనకు జనవరి నెల ఎలా గడిచిందనే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. సిటాడెల్ టీంతో మీటింగ్, వర్కవుట్, అలసట, ఫోటోషూట్ లతో గత నెల పూర్తైందంటూ తనకు తాను ధైర్యం చెప్పుకుంది. అంటే సమంత తన కెరీర్ మీద పూర్తిగా దృష్టిసారించడంతో పాటు రెట్టించిన ఉత్సాహంతో షూటింగ్ లకు, ఫోటోషూట్ లకు హాజరవుతున్నట్లు తెలుస్తోంది.

ఇక తన పరిస్థితిని కూడా సమంత ట్వీట్ ద్వారా వెల్లడించింది. సమంత ట్వీట్ చేస్తూ.. ‘గట్టిగా ఊపిరి పీల్చుకో పాప. త్వరలో అన్నీ చక్కబడతాయని నేను నీకు మాటిస్తున్నా. గడిచిన ఏడెనిమిది నెలలుగా నువ్వు అత్యంత ఇబ్బందికరమైన రోజులను చూస్తూ ముందుకు సాగావు. వాటిని మర్చిపోవద్దు. ఆ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నావో ఎప్పటికీ గుర్తు పెట్టుకో. ఆలోచించడం మానేశావు. దేని పైనా దృష్టిపెట్టలేకపోయావు. సరిగ్గా నడవలేకపోయావు. ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ధైర్యంగా ముందుకు అడుగువేశావు. నీ విషయంలో నేను ఎంతో గర్వంగా ఉన్నా. నువ్వవు కూడా నాలాగే గర్వపడకు, ధైర్యంగా మరింత ముందుకు సాగిపో’ అని పేర్కొంది.