Site icon HashtagU Telugu

Singer Mangli: నేను ఇప్పుడు పెళ్లి చేసుకునే మూడ్‌లో లేను: సింగర్ మంగ్లీ రియాక్షన్

Mangli Birthday Party

Mangli Birthday Party

Singer Mangli: తెలంగాణకు చెందిన ప్రముఖ సింగర్ మంగ్లీ పెళ్లి చేసుకోబోతుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల ఈ సింగర్ ‘జామ్ జమ్ జజ్జనకా(భోళా శంకర్), జింతక్ చితక(ధమాకా) ‘ఊరు పల్లెటూరు’ (బలగం) మరియు కన్నడ పాట ‘ఊ అంతియా ఊ ఓ ఊ అంతియా’ లాంటి సూపర్ హిట్స్ పాటలతో ఆకట్టుకుంది. అయితే సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న తన పెళ్లి పుకార్లతో ఆమె విసిగిపోయినట్లు కనిపిస్తోంది. “పెళ్లి చేసుకుంటున్నారా” అని ఆమె ప్రశ్నించగా “నాకు కూడా తెలియని నా బంధువుల్లో ఒకరితో పెళ్లి చేస్తున్నారు.” అని రియాక్ట్ అయ్యింది.

ఆమె ఇంకా మాట్లాడుతూ “ఈ పుకార్లు అబద్ధం, నిజానికి, నేను ఇప్పుడు పెళ్లి చేసుకునే మూడ్‌లో లేను” అంటూ తేల్చి చెప్పింది. మరో రెండు నెలల్లో ఆమె తన బంధువును పెళ్లి చేసుకోబోతోందని గతంలో పుకార్లు షికార్లు చేశాయి. పెళ్లి సమయంలో కాస్త స్వేచ్ఛగా ఉండేందుకు ఆమె ఇప్పట్నుంచే తొందర పడుతున్నట్టు తెలుస్తోంది. అయితే సింగర్ మంగ్లీ ఈ వార్తలను కొట్టేయడంతో పుకార్లకు చెక్ పడింది.

నిజానికి, మంగ్లీ, అలియాస్ సత్యవతి రాథోడ్, టీవీ వ్యాఖ్యాత మరియు నటి కూడా. ఆమె సాంప్రదాయ బంజారా వస్త్రధారణకు ప్రసిద్ధి చెందింది మరియు భారతదేశం అంతటా పండుగ కార్యక్రమాలలో తెలంగాణ పాటలు మరియు ప్రదర్శనలకు ప్రసిద్ధి చెందింది. సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకోవడానికి ‘బతుకమ్మ’, “బోనాలు’, ‘సంక్రాంతి’ మరియు ‘సమ్మక్క సారక్క జాతర’ వంటి ప్రత్యేక కార్యక్రమాల కోసం చేసిన వీడియో సాంగ్స్ పాపులర్ అయ్యాయి.

Also Read: MK Stalin: విద్యారంగంలో రూ.68.77కోట్ల పెట్టుబడి: ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్