Site icon HashtagU Telugu

Ileana: తన గురించి ఎవరైనా ఏదైనా అంటే నేను తట్టుకోలేను: ఇలియానా

Mixcollage 18 Mar 2024 09 28 Am 9780

Mixcollage 18 Mar 2024 09 28 Am 9780

టాలీవుడ్ హీరోయిన్, గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొదట దేవదాసు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఈ సినిమాతో మంచి గుర్తింపును ఏర్పరచుకున్న ఈ ముందు బొమ్మ ఈ మూవీ తర్వాత వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోయింది. మహేష్, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌ లో వచ్చిన పోకిరి సినిమాలో నటించి ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్‌ గా మారి పోయింది. ఆ తరువాత టాలీవుడ్ లో పలువురు స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. ఒకప్పుడు తన అందచందాలతో ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది.

ఒకవైపు టాలీవుడ్ సినిమాలలో నటిస్తూనే మరోవైపు బాలీవుడ్ సినిమాలలో కూడా నటించింది. బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటించి అక్కడ కూడా హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో అవకాశాలు అందుకుంటున్న సమయంలోనే బాలీవుడ్ పై ఫోక2స్ చేసింది ఇలియానా కానీ అక్కడ అవకాశాలు అంతగా అందుకోలేకపోయింది. ఈ క్రమంలోనే ఒక వ్యక్తిని ప్రేమించడం, బ్రేకప్ చెప్పుకోవడం కూడా జరిగిపోయాయి. దాంతో డిప్రషన్ లోకి వెళ్ళిపోయింది ఇలియానా. అదే సమయంలో బాగా బరువు పెరిగింది. తిరిగి సినిమాల్లో రాణించాలని ప్రయత్నించినా అది కుదరలేదు. అయితే ఇటీవలే ఈ చిన్నది ఒక బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.

 

పెళ్లి కాకుండానే గర్భం దాల్చి అందరికి షాక్ ఇచ్చింది. చాలా రోజుల వరకు తన భర్త ఎవరో చెప్పలేదు ఈ చిన్నది. పెళ్లి చేసుకోకుండానే ఒక బిడ్డకు జన్మనిచ్చి వార్తల్లో నిలిచింది ఈ వయ్యారి. ఇక సోషల్ మీడియాలో ఇలియానా చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం రకరకాల ఫోటోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది. తాజాగా ఈమె తన భర్త గురించి మాట్లాడుతూ.. పెళ్లి చేసుకోకుండా తల్లయినప్పుడు చాలా మంచి తనను ట్రోల్ చేశారని తెలిపింది. తననే కాదు తన భర్త పై కూడా ట్రోల్స్ చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. గర్భవతి అయినా కూడా సినిమాలు చేయాలని అనుకున్నా కానీ అదికుదరలేదు. బిడ్డ పుట్టినప్పుడు ఒత్తిడికి లోనయ్యాను. అప్పుడు నా భర్త నాకు చాల సపోర్ట్ చేశాడు. మా బంధం గురించి బయటకు చెప్పడం నాకు ఇష్టం లేదు. నా గురించి ఎమన్నా నేను తట్టుకోగలను కానీ నా భర్త గురించి, నా కుటుంబం గురించి ఎవరైనా ఏమైనా అంటే నేను తట్టుకోలేను అని చెప్పుకొచ్చింది ఇలియానా.