Ileana : బాలీవుడ్ రావడం వల్లే అవకాశాలు తగ్గాయంటున్న ఇలియానా..!

Ileana బర్ఫీ హిట్ తో బాలీవుడ్ కాస్త బిజీగా ఉన్న టైం లో తెలుగు నుంచి ఆఫర్లు వచ్చాయి. అయితే అమ్మడు కెరీర్ బాలీవుడ్ లోనే

Published By: HashtagU Telugu Desk
One Chance please Ileana Requesting to Makers

One Chance please Ileana Requesting to Makers

Ileana తెలుగులో దేవదాస్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి సెకండ్ సినిమానే మహేష్ తో పోకిరి ఆఫర్ అందుకుని ఆ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన గోవా బ్యూటీ ఇలియానా పోకిరి తర్వాత వరుస స్టార్ సినిమాలతో తెలుగులో టాప్ ప్లేస్ సంపాదించింది. స్టార్ హీరోలంతా ఆమెతో జత కట్టేందుకు ఆసక్తి చూపించే వారు. మహేష్, ఎన్.టి.ఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ ఇలా స్టార్ హీరోలందరితో కలిసి నటించి స్టార్ ఫాం కొనసాగించిన ఇలియానా సౌత్ లో సూపర్ ఫాం లో ఉన్న టైం లో బాలీవుడ్ లో ఆఫర్ రాగానే అక్కడకు వెళ్లిపోయింది.

హిందీలో రణ్ బీర్ కపూర్ నటించిన బర్ఫీ సినిమాలో ఛాన్స్ అందుకున్న ఇలియానా ఆ మూవీతో అక్కడ సూపర్ హిట్ అందుకుంది. బర్ఫీ హిట్ తో బాలీవుడ్ కాస్త బిజీగా ఉన్న టైం లో తెలుగు నుంచి ఆఫర్లు వచ్చాయి. అయితే అమ్మడు కెరీర్ బాలీవుడ్ లోనే బాగుంటుందని సౌత్ సినిమా ఆఫర్లను కాదనేసింది. ఆ టైం లో కమిట్మెంట్ ఇచ్చిన సినిమాలు కూడా చేయలేదని ఇలియానాపై దర్శక నిర్మాతలు ఫైర్ అయ్యారు.

ఇక ఇన్నాళ్లకు ఇలియానా సౌత్ లో తనకు అవకాశాలు రాకపోవడానికి కారణాలు వెల్లడించింది. తను బాలీవుడ్ లో సినిమాలు చేయడం వల్లే సౌత్ సినిమాలు చేయలేకపోయానని. బర్ఫీ లాంటి సినిమాలో నటించే అవకాశం మళ్లీ మళ్లీ రాదని అందుకే ఆ సినిమా కోసం సౌత్ లో కొన్ని సినిమాలు వదులుకున్నానని. ఆ తర్వాత సౌత్ సినిమాల్లో అవకాశాలు తగ్గాయని చెప్పుకొచ్చింది ఇల్లి బేబ్.

సౌత్ సినిమాలను కాదని వెళ్లాక మళ్లీ ఇక్కడ అవకాశాల కోసం ప్రయత్నించినా సరే ఇలియానాకు ఛాన్స్ ఇవ్వలేదు. ఫైనల్ గా రవితేజ హీరోగా వచ్చిన అమర్ అక్బర్ ఆంటోని సినిమా తో మళ్లీ తెలుగులో అవకాశం అందుకుంది. కానీ ఆ సినిమా ఫెయిల్ అవ్వడంతో మళ్లీ అమ్మడికి ఎవరు ఛాన్స్ ఇవ్వలేదు.

  Last Updated: 30 Apr 2024, 01:48 PM IST