Site icon HashtagU Telugu

Ileana D’Cruz : ఇలియానా బేబీ బంప్ చూశారా? డెలివరీకి రెడీ..

Ileana D'Cruz shows her Baby Bump shares photo in social media

Ileana D'Cruz shows her Baby Bump shares photo in social media

ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇలియానా(Ileana) ఇటీవల సడెన్ గా తల్లి కాబోతున్నట్టు, తాను ప్రగ్నెంట్(Pregnant) అని ప్రకటించింది. పెళ్లి చేసుకోకుండానే తల్లి అని ప్రకటించడంతో అంతా షాక్ అయ్యారు. ఇక తండ్రి ఎవరో కూడా చెప్పకపోవడంతో అందరూ ఇలియానాని ప్రశ్నించారు. ప్రగ్నెన్సీ ప్రకటించిన దగ్గర్నుంచి తన ప్రగ్నెన్సీ సమయాన్ని ఎంజాయ్ చేస్తూ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ మరింత వైరల్ అవుతుంది.

ఇటీవల ఓ ఫారిన్ అబ్బాయితో ఫోటో కూడా షేర్ చేసి అతనే తనకు పుట్టబోయే బిడ్డకి తండ్రి అని ఇండైరెక్ట్ గా చెప్పింది. తాజాగా తన బేబీ బంప్ తో సెల్ఫీ తీసుకొని ఫోటో పోస్ట్ చేసింది ఇలియానా. రెడ్ డ్రెస్ లో ఇలియానా ఈ ఫోటోని షేర్ చేయగా ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది. ఈ బేబీ బంప్ చూస్తుంటే ఇలియానాకు 7 లేదా 8వ నెల అయి ఉండొచ్చని భావిస్తున్నారు.

ఇలియానా ఈ ఫోటోని షేర్ చేసి.. మై లిటిల్ అని పోస్ట్ చేసింది. త్వరలోనే ఇలియానా డెలివరీ అవుతుందని సమాచారం. ఇప్పటికి కూడా ఆ పుట్టబోయే బిడ్డకి తండ్రి ఎవరు అంటూ పలువురు అభిమానులు, నెటిజన్లు ఇలియానా పోస్ట్ కింద కామెంట్స్ చేస్తున్నారు.

 

Also Read : Srikanth : షారుఖ్ ఖాన్ మూవీ రీమేక్.. శ్రీకాంత్ హీరోగా అనౌన్స్ చేసి.. తర్వాత హీరోని మార్చేసి..