Site icon HashtagU Telugu

Ileana D’Cruz : సినిమాలు లేక ప్రైవేట్ సాంగ్స్ చేసుకుంటున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్..

Ileana D'Cruz doing Private Albums

Ileana D'Cruz doing Private Albums

దేవదాసు, పోకిరి, కిక్, జల్సా, జులాయి.. లాంటి సూపర్ హిట్ సినిమాలతో తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎదిగింది ఇలియానా(Ileana). తెలుగుతో పాటు తమిళ్ లో కొన్ని సినిమాలు చేసింది. తెలుగులో వరుస సినిమాలు చేస్తున్న టైంలోనే బాలీవుడ్(Bollywood) లో ఆఫర్ రావడంతో అక్కడికి చెక్కేసింది ఈ ముద్దుగుమ్మ. బాలీవుడ్ లో వరుసగా కొన్ని సినిమాలు చేసినా అంతగా కలిసి రాలేదు.

దీంతో గత కొన్నాళ్లుగా ఇలియానా నుంచి సినిమాలేమి రాలేదు. నాలుగేళ్ల గ్యాప్ లో కేవలం రెండు బాలీవుడ్ సినిమాలు మాత్రమే వచ్చాయి. సినిమాల్లో ఛాన్సులు రాకపోయినా సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్ గా బోల్డ్ ఫొటోలతో హడావిడి చేస్తుంది ఇల్లీ బేబీ. ఇక సినిమాలు తగ్గిపోవడంతో ఇప్పుడు ప్రైవేట్ సాంగ్స్ చేస్తుంది ఇలియానా.

గతంలో ఓ రెండు ప్రైవేట్ ఆల్బమ్స్ చేసిన ఇలియానా తాజాగా మరో ప్రైవేట్ ఆల్బమ్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. పంజాబీ పాప్ సింగర్స్ Goldkartz, Badshah లతో కలిసి Sab Gazab అనే ఓ ప్రైవేట్ సాంగ్ చేసింది. ఒకప్పుడు జీరో సైజ్ కి కేరాఫ్ అడ్రస్ అయిన ఇలియానా ఇటీవల కొంచెం బొద్దుగా తయారైన సంగతి తెలిసిందే. ఈ పాటలో కూడా బొద్దుగా కనపడి అభిమానులని, ప్రేక్షకులని అలరించింది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉండగా ఇలియానా మళ్ళీ సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఇలియానా మళ్ళీ ఎప్పుడు వెండితెరపై కనిపిస్తుందో చూడాలి.

 

Also Read :   Alia Bhatt : రాజమౌళిని అలియా భట్ యాక్టింగ్ సలహా అడిగితే ఏం చెప్పాడో తెలుసా?