Ilayaraja: రజనీకాంత్ ను సడన్ గా కలుసుకున్న ఇళయరాజా.. దానికోసమే అంటూ..!

తమిళనాట రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా? ఎందుకంటే సూపర్ స్టార్ రజనీకాంత్ ను మ్యూజిక్ లెజెండ్ ఇళయరాజా స్వయంగా కలుసుకున్నారు.

Published By: HashtagU Telugu Desk
Ilayaraja Rajinikanth

Ilayaraja Rajinikanth

తమిళనాట రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా? ఎందుకంటే సూపర్ స్టార్ రజనీకాంత్ ను మ్యూజిక్ లెజెండ్ ఇళయరాజా స్వయంగా కలుసుకున్నారు. పైకి కారణాలను స్పష్టంగా చెప్పకపోయినా వీరిద్దరి భేటీ మాత్రం తమిళ రాజకీయాల్లో ఆసక్తిని పెంచింది. ఈమధ్యకాలంలో ఎప్పడూ లేనిది ఇళయరాజా.. ఉన్నట్టుండి సడన్ గా పోయెస్ గార్డెన్ లోని రజనీకాంత్ ఇంటికి వెళ్లారు. దీంతో ఆయనను చూసి రజనీకాంతే షాకయ్యారు.

ఇళయరాజా సడన్ గా వచ్చినా.. అంతటి పెద్దమనిషి స్వయంగా తన ఇంటికి రావడంతో సాదరంగా ఆహ్వానించారు. ఇద్దరూ చాలా సేపు మాట్లాడుకున్నారు. భేటీ ముగిసిన తరువాత ఇళయరాజా బయలుదేరడానికి సిద్ధమయ్యారు. కానీ ఆయన ఎందుకు వచ్చారో అప్పటికి కూడా రజనీకాంత్ కు క్లారిటీ లేదు. అందుకే ఆయనే స్వయంగా మ్యూజిక్ మ్యాస్ట్రోను అడిగారు. ఏమైనా పని మీద వచ్చారా అంటూ అడిగినా సరే.. ఇళయరాజా ఏమీ చెప్పలేదు.

తాను వేరే పనిమీద రాలేదని.. జూన్ 2న కోయంబత్తూరులో సంగీత కచేరీ ఉందని.. దానికి సంబంధించిన రిహార్సల్స్ స్టూడియోలో జరుగుతున్నాయని చెప్పారు. ఆయన ఎందుకు వచ్చారు అన్నదానిపై స్పష్టత ఇవ్వకపోయినా.. తాను కూడా స్టూడియోకు వస్తానంటూ ఇళయరాజాతోపాటు వెళ్లడానికి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నారు. అక్కడే కాసేపు ఉన్నారు. రిహార్సల్స్ ను చూసి చాలా ముచ్చటపడ్డారు.

ఆమధ్యన ఇళయరాజా అకస్మాత్తుగా మోదీని పొగిడారు. ఆయన ఎందుకు అలా చేశారో అప్పుడు ఎవరికీ అర్థం కాలేదు. కానీ అదే వరుసలో ఇప్పుడు రజనీతో భేటీ కావడం వెనుక మాత్రం ఏదో బలమైన కారణం ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. దీంతో అదేమిటా అన్నదానిపై తమిళరాజకీయాల్లో హాట్ డిస్కషన్ నడుస్తోంది.

  Last Updated: 25 May 2022, 12:44 PM IST