Ilayaraja ఈ ఇయర్ వచ్చిన సూపర్ హిట్ సినిమాల్లో మంజుమ్మల్ బాయ్స్ ఒకటి. మలయాళంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో కూడా రిలీజై మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమాను మలయాళంలో పరవ ఫిలింస్ బ్యానర్ లో సౌబిన్ సాహిర్, బాబు సాహిర్, షాన్ ఆంటోని కలిసి నిర్మించారు. తెలుగులో ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ రిలీజ్ చేసి లాభాలు తెచ్చుకున్నారు. ఐతే ఈ సినిమాలో కమల్ హాసన్ గురు సినిమాలోని సాంగ్ ని తన పర్మిషన్ లేకుండా వాడారని మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా చిత్ర నిర్మాతల మీద కేసు వేశారు.
తన పర్మిషన్ లేకుండా గురు సాంగ్ ని వాడినందుకు ఇళయరాజా మంజుమ్మల్ బోయ్స్ (Manjummal Boys) మేకర్స్ కు నోటీసులు పంపించాడు. ఐతే దీనిపై చర్చలు జరపగా వ్యవహారం పరిష్కారమైనట్టు తెలుస్తుంది. మంజుమ్మల్ బోయ్స్ లో తన పర్మిషన్ లేకుండా వాడినందుకు 2 కోట్ల దాకా ఇళయరాజా డిమాండ్ చేశారని తెలుస్తుంది. ఐతే సినిమా సూపర్ హిట్ అవ్వడంతో చర్చలు జరిపిన నిర్మాతలు ఇళయరాజాకు 60 లక్షలు ఇచ్చి సమస్య పరిష్కరించుకున్నారని తెలుస్తుంది.
Also Read : Mooments of G2 : గూఢచారి 2 మూమెంట్స్ అదిరిపోయాయ్..!
ఇళయరాజాని ముందే కలిసి పర్మిషన్ తీసుకుంటే ఇంత మొత్తం ఇచ్చే పరిస్థితి ఉండేదా కాదా అన్నది తెలియదు కానీ సినిమా సూపర్ హిట్ అవ్వడం ఆ సినిమాలో ఆ సాంగ్ ఎక్కువగా వినిపించడం వల్ల ఇళయరాజా మేకర్స్ కు నోటీసులు పంపించాల్సి వచ్చింది. ఐతే తన సాంగ్ ను తన పర్మిషన్ లేకుండా వాడినందుకు మేకర్స్ మీద అసంతృప్తి వ్యక్తం చేసిన ఇళయరాజా డిస్కషన్ తో ఇష్యూని స్లాఫ్ చేసుకున్నారట.
ఐతే ఈ సినిమా రిలీజైన టైం లో ఇళయరాజా నోటీసులు పంపించినప్పుడు ఆయన మీద సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో విమర్శలు చేశారు. కానీ ఆయన పాట ఎలాంటి పర్మిషన్ లేకుండా వాడటం అనేది కరెక్ట్ కాదని నోటీసులు అందుకున్న మేకర్స్ అలా ఆయనకు తగిన మొత్తాన్ని ఇచ్చినట్టు తెలుస్తుంది.