Ilaiyaraaja Copyright Notice: లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన ‘కూలీ’ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి. అయితే ఈ చిత్రానికి కూలీ టైటిల్ కి ముందు తాత్కాలికంగా ‘తలైవర్ 171’ అనే టైటిల్ పెట్టారు. ఇటీవలే విడుదల చేసిన టీజర్‌కు విశేష స్పందన లభించింది. తాజా నివేదికల ప్రకారం ‘కూలీ’ న్యాయపరమైన చిక్కుల్లో పడింది. లెజెండరీ సంగీతకారుడు ఇళయరాజా అనుమతి లేకుండా సినిమా టీజర్‌లో తన సంగీతాన్ని ఉపయోగించారనే ఆరోపణలపై ‘కూలీ’ నిర్మాతలకు కాపీరైట్ నోటీసు జారీ చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి . అతను తన సంగీతాన్ని తీసివేయాలని కూడా డిమాండ్ చేశాడు.
ఈ సినిమా టైటిల్ టీజర్ ఏప్రిల్ 22న విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది. స్వల్ప కాలంలోనే టీజర్ ను యూట్యూబ్ లో కోటిన్నర మందికి పైగా వీక్షించారు. అనిరుధ్ అందించిన బీజీఎం టీజర్ ని మరో స్థాయికి తీసుకెళ్లింది. టీజర్లో రజనీకాంత్ మాస్ లుక్స్ హైలైట్ గా నిలిచాయి. అయితే ఆ బిజిఎం ‘తంగమకన్’ సినిమా కోసం ఇళయరాజా పాడిన “వా వా పక్కం వా” పాటకి రీక్రియేషన్. ఈ నేపథ్యంలో సంగీత దర్శకుడు ఇళయరాజా స్పందించారు. కాగా ఇళయరాజా స్వరపరిచిన ఈ పాటను ప్రముఖ దివంగత గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం, వాణి జయరామ్ ఆలపించారు. ఈ పాటను మత్తులింగం రచించారు. ఈ పాటలో రజినీకాంత్, పూర్ణిమ ఆడి పాడి అలరించారు.
We’re now on WhatsApp. Click to Join
‘కూలీ’ చిత్రానికి లోకేష్ కనగరాజ్ కథ, దర్శకత్వం వహించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. దీనిని కళానిధి మారన్ తన సన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇది తమిళం, హిందీ, తెలుగు, కన్నడ భాషల్లో విడుదల కానుంది.
Also Read: PM Kisan Rejection: పీఎం కిసాన్ నిధి యోజన దరఖాస్తు తిరస్కరణకు కారణాలివే..!