Site icon HashtagU Telugu

Kajal Aggarwal: వామ్మో కాజల్ అగర్వాల్ కి ఏకంగా అన్ని రూ.కోట్ల ఆస్తి ఉందా.. బాగానే సంపాదించిందిగా?

Kajal Aggarwal

Kajal Aggarwal

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి మనందరికీ తెలిసిందే. టాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో నటించి హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది కాజల్ అగర్వాల్. ముఖ్యంగా చందమామ సినిమాతో భారీగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత కాజల్ ను చందమామ అని పిలవడం మొదలుపెట్టారు అభిమానులు. తెలుగులో టాలీవుడ్లో స్టార్ హీరోల అందరి సరసన నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం పెళ్లి చేసుకుని మ్యారేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ పెళ్లి తర్వాత కూడా ఏమాత్రం తగ్గకుండా అదే ఊపుతో వరసగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తోంది.

కాజల్ కు ప్రస్తుతం ఒక బాబు కూడా ఉన్న విషయం తెలిసిందే. ఈమె తన చిన్ననాటి స్నేహితుడు బిజినెస్ మ్యాన్ గౌతమ్ కిచ్లూని పెళ్లి చేసుకుంది. ఇకపోతే ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ బాగానే సంపాదిస్తోంది కాజల్. చాలా రకాల యాడ్స్ లో చేసి బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరించిన విషయం తెలిసిందే. మొదట లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించి మెప్పించింది. యంగ్ హీరోల నుంచి స్టార్ హీరోల వరకు ప్రతి ఒక్కరి సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది కాజల్.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో కాజల్ అగర్వాల్ ఆస్తిపాస్తులకు సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది. కాజల్ ఆస్తిల గురించి తెలిసి అభిమానులు షాక్ అవుతున్నారు. కాగా కాజల్ అగర్వాల్​ నెట్​ వర్త్​ రూ.67 కోట్ల వరకు ఉండవచ్చని టాక్. కొన్ని వెబ్​సైట్ల లో ఆమె దగ్గర ఉన్న ఆస్తులు రూ.90కోట్ల వరకు ఉండవచ్చని అంచన. కాగా కాజల్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.2 నుంచి రూ.4 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటునట్లు తెలుస్తోంది. అలాగే ఆమెకు ముంబయిలో రూ.6 కోట్ల విలువ గల లగ్జరీ బంగలా ఉందట. ఆమె దగ్గర ఖరీదైన విలాసవంతమైన కార్లు కూడా ఉన్నాయి. ఆడీ ఏ4, రేంజ్ రోవర్, స్కోడా అక్టావియా ఉన్నాయట. అలానే ఆమెకు బ్యూటీ ప్రొడక్ట్స్​ కు సంబంధించిన కంపెనీ కూడా ఉందట. వీటితోపాటు స్థిర చర ఆస్తులు కలిపి ఇంకా కొన్ని కోట్లు ఎక్కువగానే ఉంటుందని తెలుస్తోంది.