Site icon HashtagU Telugu

Johnny Master: ఆ ఆరోపణలు నిజమని నిరూపిస్తే ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోతా

Johnny Master Elected as President for Telugu Film and TV Dancers and Dance Directors Association

Johnny Master Elected as President for Telugu Film and TV Dancers and Dance Directors Association

Johnny Master: నృత్య దర్శకుడిగా జానీ మాస్టర్ స్థాయి పాన్ ఇండియా లెవల్ సినిమాల వరకు వెళ్ళింది. తెలుగుతో పాటు తమిళ, హిందీ సినిమాల్లో పాటలకు ఆయన కొరియోగ్రఫీ చేస్తున్నారు. మరోవైపు తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA) అధ్యక్షుడిగా డ్యాన్సర్స్ అభివృద్ధికి పాటు పడుతున్నారు. అయితే… ఇటీవల సతీష్ అనే డ్యాన్సర్ జానీ మాస్టర్ మీద పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పాటు ఒక వీడియో విడుదల చేశారు. అందులో పలు ఆరోపణలు చేశారు. అవి నిజమని నిరూపిస్తే తాను ఇండస్ట్రీ వదిలేసి వెళ్లిపోతానని జానీ మాస్టర్ చెప్పారు. ఈ వివాదం పూర్వాపరాలు వెల్లడించడానికి అసోసియేషన్ సభ్యులతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు.
తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA) అధ్యక్షుడు జానీ మాస్టర్ మాట్లాడుతూ… ”ఇక్కడ నేను ఓ పార్టీకి, ఓ ప్రాంతానికి సంబందించిన వ్యక్తిగా కాకుండా ఈ అసోసియేషన్ అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాను. మా యూనియన్ కోసం ఒక ప్రాంతంలో ఐదు కోట్లతో ఒక ల్యాండ్ తీసుకున్నాం. అది సమస్యల్లో చిక్కుకున్నది. జానీ మాస్టర్ ఉంటే పెద్దలతో మాట్లాడి అది తీసుకు వస్తారని, హెల్త్ ఇన్సూరెన్స్ చేయిస్తారని నమ్మి నన్ను ఎన్నుకున్నారు. నేను అధ్యక్షుడు అయ్యి ఆరు నెలలు అవుతోంది.

ఈ సమయంలో ఏపీ, తెలంగాణలో ఎన్నికల కోడ్ ఉంది. మధ్యలో రంజాన్ వచ్చింది. ఆ సమయంలో నేను పాటలు వినను. కొరియోగ్రఫీ కూడా చేయను. నెల రోజులు దీక్షలో ఉన్నాను. ఈ ఆరు నెలల్లో హెల్త్ ఇన్సూరెన్స్ గురించి రామ్ చరణ్, ఉపాసన గారితో మాట్లాడాను. యూనియన్ అభివృద్ధి కోసం చర్యలు చేపట్టాం. పలు పనులు చేశాం. ఇక, సతీష్ విషయానికి వస్తే… అయేషా గారు చెప్పినవన్నీ నిజాలు. రూల్స్ ప్రకారం కమిటీ, కొరియోగ్రాఫర్లతో మాట్లాడి అతడికి లక్ష రూపాయలు ఫైన్ విధించారు. మా అసోసియేషన్‌లో ఎవరికైనా ఇబ్బంది వస్తే నేను డబ్బులు ఇచ్చాను. ఒకరి పొట్ట కొట్టాలని అనుకోను. సతీష్ గనుక తప్పు అయ్యిందని లెటర్ రాస్తే మొదటి తప్పుగా క్షమించి వదిలేసేవాళ్ళం. ఫైన్ వేసేవాళ్ళం కాదు. నేను ఏంటో చూపిస్తానని కొందరిని బెదిరించారు. ఈ నాలుగు నెలల్లో కొన్ని పాటలు కూడా చేశారు.

పైగా నా మీద ఆరోపణలు చేశారు. సతీష్ ఒక వీడియో విడుదల చేశారు. అందులో ఒక్కటి నిజమైనా సరే నేను ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోతా. నేను ఒక చోట రాష్ట్ర ప్రచార కమిటీ వైస్ ఛైర్మన్ గా ఉన్నాను. నా వల్ల మా అధినేతకు ఇబ్బంది రాకూడదు. నా తరఫునుంచి తెలంగాణకు ఇబ్బంది రాకూడదు. అందుకే, ఈ ప్రెస్ మీట్ పెట్టాను” అని చెప్పారు.