Shah Rukh Khan: షారుక్ ఖాన్ కు కోపం వస్తే అంతే మరి!

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  • Written By:
  • Publish Date - May 3, 2023 / 01:28 PM IST

ఒకప్పుడు అభిమాన హీరోలు (Stars), హీరోయిన్స్ కనబడితే ఆటోగ్రాఫ్ ప్లీజ్ అంటూ వెంటపడేవారు అభిమానులు. ఇప్పుడు 2023 కదా.. ఓన్లీ సెల్పీలు అంటూ చిరాకు తెప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ (Shah Rukh Khan) వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సెల్ఫీకి షారుఖ్‌ను అడక్కుండానే.. పక్కన నడుస్తూ మొబైల్‌తో ఫొటో తీయడానికి ప్రయత్నించాడు ఓ అభిమాని.

ఇది షారుక్ కు చికాకు తెప్పించింది. వెంటనే ఆ అభిమానిని పక్కకు నెట్టేశాడు. ఈ వీడియో (Video) సోషల్ మీడియాలోకి వైరల్ అవుతుంది. అభిమానితో షారుఖ్ దురుసుగా ప్రవర్తించాడంటూ కొందరు ఆయన్ని విమర్శిస్తుంటే.. కనీసం సెల్ఫీ కోసం పర్మిషన్ కూడా అడక్కుండా ఆ అభిమాని అత్యుత్సాహం ప్రదర్శించడాన్ని కొందరు తప్పుబడుతున్నారు.

సినిమా హీరోలు కనబడితే వారిని చూసేందుకు, ఫొటోలు దిగేందుకు అబిమానులు (Fans) ఎగబడటం సాధారణం. ఐతే ఆ హీరోలు ఎలాంటి మూడ్‌లో ఉన్నారు.. మనం వారిని ఎక్కడ కలిశాం.. వారి ప్రైవసీ సంగతేంటి.. ఇలాంటివన్నీ కొంచెం చూస్కోవాలి. ఫొటోలు, సెల్ఫీలు దిగేటపుడు కనీసం అనుమతి అడగాలి కదా ఆయన అభిమానులు షారుక్ ఖాన్ కు సపోర్ట్ చేస్తున్నారు.

Also Read: Rashmika and Bellamkonda: రష్మిక తో డేటింగ్.. బెల్లంకొండ రియాక్షన్ ఇదే!