న్యాచురల్ స్టార్ నాని హీరోగా వరుస సినిమాలు హిట్లు కొడుతూ తన రేంజ్ పెంచుకుంటూ వస్తున్నాడు. నాని సినిమా అంటే చాలు మినిమం గ్యారెంటీ అనుకునేలా చేశాడు. లాస్ట్ ఇయర్ దసరా, హాయ్ నాన్న సినిమాలతో హిట్లు అందుకున్న నాని ఈసారి సరిపోదా శనివారం (Saripoda Shanivaram)తో రాబోతున్నాడు. వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఈమధ్యనే వచ్చిన ట్రైలర్ ఇంప్రెస్ చేసింది. సినిమా ఈ నెల చివరన రిలీజ్ అవుతుంది. న్యాచురల్ స్టార్ నాని ఫ్యాన్స్ అంతా కూడా సినిమాపై భారీ హోప్స్ పెట్టుకున్నారు.
ఐతే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాని ఒకవేళ హీరో కాకపోతే ఏమయ్యే వాడు అన్న దానికి ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చాడు. సినిమాల మీద ఇష్టం ఉన్న తనకు సినిమాల్లో ఏదో ఒక భాగంలో పనిచేయాలని ఉండేదని. ఒకవేళ యాక్టర్ కాకపోతే ప్రొజెక్టర్ ఆపరేటర్ ని అవుతానని అన్నాడు నాని. సో సినిమాల మీద ఇష్టం అది యాక్టర్ అయినా కాకపోయినా ప్రొజెక్టర్ ఆపరేటర్ గా అయినా పనిచేస్తానని చెబుతున్నాడు నాని.
Also Read : Raviteja : మిస్టర్ బచ్చన్ ట్రిం చేశారోచ్..!
నాని (Nani)ఇచ్చిన ఆన్సర్ అతని ఫ్యాన్స్ ని కూడా మెస్మరైజ్ చేసింది. ఎటొచ్చి సినిమాలకు సంబందించి ఏదో ఒక విభాగంలో పనిచేయాలన్నది అతని కల అని చెప్పాడు. కానీ ఇప్పుడు నాని మంచి హీరో అయ్యాడు. అతనితో సినిమా అంటే చాలు పక్కా హిట్ అనే అంచనాలు ఉన్నాయి. నాని సరిపోదా శనివారం సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించింది.
ఎస్ జె సూర్య విలన్ గా నటించిన సరిపోదా శనివారం (Saripoda Shanivaram) సినిమా కాన్సెప్ట్ మాత్రం కొత్తగా ఉంటుందని తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమాలో నాని మాస్ మేనియా అతన్ని టైర్ 2 నుంచి టైర్ 1కి ప్రమోట్ అయ్యేలా చేస్తుందని అంటున్నారు. మరి నాని మార్క్ ఎంటర్టైనర్ గా మాత్రమే కాదు మాస్ ఎంటర్టైనర్ గా సరిపోదా శనివారం అలరిస్తుందా లేదా అన్నది చూడాలి.