సినీ ప్రేక్షకులకు బాగా దగ్గరైన హీరోయిన్లలో కన్నడ బ్యూటీ అనుష్క శెట్టి (Anushka Shetty) .. ఎన్నో ఏళ్ల పాటు ఆమె టాలీవుడ్ లో అగ్రనటిగా వెలుగొందారు. ఆ తర్వాత బొద్దుగా మరియు వయసు కూడా పెరగడంతో ఆమెకు ఆఫర్లు తగ్గాయి. ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్న ‘మిస్టర్ పోలిశెట్టి’ చిత్రంలో అనుష్క శెట్టి (Anushka Shetty) నటిస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ లో స్వీటీ బిజీగా ఉన్నారు. మరోవైపు ఆమెకు సంబంధించిన ఒక విషయం వెలుగులోకి వచ్చింది. నవ్వు ఆపుకోలేని ఒక విచిత్రమైన సమస్యతో ఆమె ఇబ్బంది పడుతోందనేదే ఆ వార్త. ఒక్కసారి నవ్వితే… కనీసం 10 నుంచి 15 నిమిషాల పాటు ఆమె నవ్వుతూనే ఉంటుందట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ఆమే స్వయంగా వెల్లడించింది. తాను నవ్వడం ప్రారంభిస్తే… షూటింగ్ ను కాసేపు ఆపేస్తారని అనుష్క తెలిపారు. తాను అటూ, ఇటూ తిరుగుతూ నవ్వుతూ ఉంటానని చెప్పారు.
Also Read: Atrocious in Delhi: ఢిల్లీలో దారుణం.. షాపింగ్ మాల్‌లో మహిళా టెకీ పై అత్యాచారం