Site icon HashtagU Telugu

Idly Vada Ram Charan : సౌత్ ఫేస్ రాం చరణ్.. అది అవమానించినట్టు కాదు.. షారుఖ్ వీడియోపై ఫ్యాన్స్ క్లారిటీ..!

Idly Vada Ram Charan Here Is The Sharukh Khan Video Clarity

Idly Vada Ram Charan Here Is The Sharukh Khan Video Clarity

Idly Vada Ram Charan అనంత్ అంబాని ప్రీ వెడ్డింగ్ వేడుకలో షారుఖ్ ఖాన్ రాం చరణ్ ని పిలిచే సందర్భంగా ఇడ్లీ వడ రాం చరణ్ అని పిలిచాడని ఒక వీడియో వైరల్ గా మారింది. ఉపాసన మేకప్ ఆర్టిస్ట్ దానిపై షారుఖ్ ఖాన్ చరణ్ మీద డిస్ రెస్పెక్ట్ ఫుల్ గా ప్రవర్తించారని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దాంతో ఒక్కసారిగా మెగా ఫ్యాన్స్ అంతా షారుఖ్ ఖాన్ పై ఫైర్ అవుతూ అతన్ని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు కొందరైతే షారుఖ్ ఖాన్ చరణ్ కి సారీ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.

అయితే ఈ మ్యాటర్ పై షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ కూడా స్పందిస్తున్నారు. షారుఖ్ ఖాన్ రాం చరణ్ ని అవమానించలేదని. ఆయన నటించిన వన్ 2 కా 4 సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. అక్కడ విలన్ ని కొడుతూ ఇండ్లీ వడ రజినికాంత్, వెంకటేష్, నాగార్జున అంటూ సౌత్ హీరోల గురించి మాట్లాడతాడు. అయితే ప్రస్తుతం ఆ వేడుకలో సౌత్ ఫేస్ గా రాం చరణ్ ని సంబోధిస్తూ ఇడ్లీ వడ రాం చరణ్ అని అతన్ని స్టేజ్ మీదకు పిలిచారు. అంతేతప్ప అక్కడ షారుఖ్ ఖాన్ ఉద్దేశ్యం రాం చరణ్ ని అవమానించడం కాదని అంటున్నారు.

పాన్ ఇండియా సినిమాలతో నేషనల్ వైడ్ గా సత్తా చాటుతున్న తెలుగు హీరోలు సినిమాలు బాలీవుడ్ స్టార్స్ కి నిద్ర పట్టకుండా చేస్తున్నాయి. మన డామినేషన్ ని తట్టుకోలేని ముంబై మీడియా ఎక్కడ ఛాన్స్ దొరికినా ఒక రేంజ్ లో ఏసుకుంటున్నారు. అయితే షారుఖ్ వీడియోపై దుష్ప్రచారం కూడా వారి ప్లాన్ లో భాగమే అని చెప్పొచ్చు.

షారుఖ్ ఖాన్ చాలా సరదాగా తన సినిమాలోని డైలాగ్ చెబితే దాన్ని చాలా సీరియస్ గా తీసుకుని అతను నిజంగానే చరణ్ ని అవమానించినట్టుగా చిత్రీకరించారు. అయితే ఈ విషయంపై మెగా ఫ్యాన్స్ కాస్త సీరియస్ గానే రియాక్ట్ అవుతున్నా.. షారుఖ్ ఖాన్ క్లారిటీ వచ్చాక కాస్త మెత్తబడ్డారని చెప్పొచ్చు.