Site icon HashtagU Telugu

ICRISAT : పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు చదువుకునే స్కూల్ ప్రత్యేకతలు ఇవే !!

Icrisat Campus

Icrisat Campus

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తన కుమారుడి (Mark Shankar) విద్య కోసం హైదరాబాద్‌ను ఎంచుకున్నారు. తాజాగా ఆయన పటాన్ చెరులోని అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్ (ICRISAT campus) పాఠశాలలో కుమారుడిని చేర్పించారు. ఈ స్కూల్‌ లో చేర్పించేందుకు ప్రారంభ అడ్మిషన్‌ ఫీజు దాదాపు పది లక్షల వరకూ అవుతుంది. అలాగే ప్రతీ సంవత్సరం ఫీజులు, ఇతర ఖర్చులతో కలిపి దాదాపు ఇరవై లక్షల వరకు ఖర్చవుతుందన్నది అంచనా. సినీ ప్రముఖులంతా తమ పిల్లల చదువుకోసం ఎంచుకునే అత్యున్నత స్థాయి స్కూల్ ఇది. మహేష్ బాబు కుమారుడు ఈ పాఠశాల నుంచే చదివి విదేశాలకు వెళ్లగా, అల్లు అర్జున్ పిల్లలు కూడా ఇక్కడే చదువుతున్నారు.

Modi Govt: 11 సంవ‌త్స‌రాల పాల‌న‌లో మోదీ ప్ర‌భుత్వం తీసుకున్న అతిపెద్ద నిర్ణ‌యాలీవే!

1981లో స్థాపించబడిన ISH స్కూల్‌ ప్రత్యేకంగా అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో నడుస్తోంది. నాన్-ప్రాఫిట్ సంస్థగా రన్ అయ్యే ఈ పాఠశాల న్యూ ఇంగ్లాండ్ అసోసియేషన్ ఆఫ్ స్కూల్స్ అండ్ కాలేజెస్ (NEASC), కౌన్సిల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ (CIS) నుండి అక్రిడిటేషన్ పొందింది. గ్రేడ్ 8 వరకు విద్యార్థులకు పరీక్షలు లేకుండా కామన్ గ్రౌండ్ కొలాబొరేటివ్ (CGC) అనే బోధనా విధానాన్ని అమలు చేస్తారు. 9,10 తరగతుల విద్యార్థులు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలోని IGCSE పద్ధతిలో చదువుతారు. 11,12వ తరగతుల్లో విద్యార్థులు ఇంటర్నేషనల్ బాకలారియేట్ డిప్లొమా లేదా ISH డిప్లొమా ప్రోగ్రామ్ ద్వారా విద్యను కొనసాగించవచ్చు.

ISH స్కూల్ విద్యలోనే కాకుండా ఆధునిక వసతుల్లోనూ అత్యున్నత ప్రమాణాలు పాటిస్తోంది. ప్రపంచంలోని 22కి పైగా దేశాల నుండి విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారు. డిజిటల్ తరగతుల నుంచి గ్రంథాలయాల వరకు, సంగీతం, కళలు, సైన్స్, కంప్యూటర్ ల్యాబ్‌లు, క్రీడా మైదానాలు, స్విమ్మింగ్ పూల్ వరకూ అన్నీ అందుబాటులో ఉన్నాయి. అంతేగాక, సొంత భద్రతా సిబ్బంది, వైద్య సదుపాయాలు కూడా ఉన్నాయి. అందుకే పవన్ తన కుమారుడ్ని ఇక్కడ జాయిన్ చేపించినట్లు తెలుస్తుంది.

Read Also : CM Revanth Reddy : ఈ నెల 16న రైతులతో సీఎం ముఖాముఖి.. కలెక్టర్లు ప్రత్యేక ఏర్పాట్లు