Allu Arjun Attitude: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మెగా కుటుంబం నుంచి వచ్చి తనకుంటూ ఓ క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. మెగా కుటుంబం నుంచి ఎప్పుడైతే కాస్త విడిపోయాడో అప్పుడో బన్నీలోని ఇగో (Allu Arjun Attitude) బయటపడింది. మెగా ఫ్యాన్స్ సైతం అతన్ని దూరం పెట్టే పరిస్థితికి తీసుకువచ్చింది. మనసులో ఏముందో తెలియదు కానీ చెప్పను బ్రదర్ అంటూ స్టార్ చేసినా బన్నీ ఈ ఏడాది ఏపీలో జనసేనకు కాకుండా వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి సపోర్ట్ చేయడం దాకా తనలో దాగి ఉన్న యాటిట్యూడ్‌ను చూపిస్తుంది. ఫ్యామిలీ కంటే ఫ్రెండే ఎక్కువ అని బన్నీ నమ్మేసి తన కోసం నంద్యాల వెళ్లాడు. తర్వాత ఏం జరిగిందో మనకీ తెలుసు. అయితే బన్నీకి యాటిట్యూడ్ ఎప్పట్నుంచో తెలియదు కానీ అది పీక్స్‌లోకి వెళ్లింది మాత్రం సుకుమార్ తీసిన పుష్ప మూవీతో అని టాక్. పుష్ప ప్రమోషన్స్ చేయకుండానే భారీ స్థాయిలో విజయం సాధించి బన్నీని నార్త్‌లో సూపర్ స్టార్‌ని చేసింది. ఇక్కడ నుంచే అల్లు అర్జున్ యాటిట్యూడ్ కూడా ఒక్క మెట్టు పెరిగింది.
Also Read: Allu Arjun: అల్లు అర్జున్ కొంపముంచుతున్న ఫ్యాన్స్, బీఆర్ఎస్!
మేటర్‌లోకి వస్తే.. డిసెంబర్ 4న తన మూవీ పుష్ప-2 ప్రీమియర్ షో చూడటానికి వచ్చాడు. అయితే అనుకోని కారణాల వలన అక్కడ రేవతి అనే మహిళా అభిమాని మృతిచెందింది. ఆమె కొడుకు ప్రస్తుతం కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇదే విషయమై గత శుక్రవారం పోలీసులు చర్యలు తీసుకుని బన్నీని అరెస్ట్ చేశారు. నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇంతవరకు బాగానే ఉంది. అయితే పోలీసులు తన పంతం నెగ్గించుకోవడానికి అల్లు అర్జున్‌ను ఒక్కరాత్రి జైలులో ఉండేలా చేశారు. ఉంచారు కూడా. శనివారం ఉదయం జైలు నుంచి విడుదలైన బన్నీని టాలీవుడ్ పెద్దలు, హీరోలు, నిర్మాతలు, ఆర్టిస్ట్‌లు కలవటానికి వచ్చారు. అయితే బన్నీ తనను కలవటానికి వచ్చిన వారి వీడియోలను తీసి తన పీఆర్ టీమ్ ద్వారా వాటని కూడా ప్రమోట్ చేసుకున్నాడు. అంతేకాకుండా సీఎం రేవంత్‌ను సైతం సినీ పెద్దలు అందరూ కలిసి ట్రోల్ చేయించారని వార్త కూడా వస్తోంది.
ఇవ్వన్నీ గమనించిన తెలంగాణ సీఎం రేవంత్ అసెంబ్లీ సాక్షిగా కొన్ని నిజాలను బయటపెట్టారు. అంతేకాకుండా తెలంగాణలో తాను సీఎంగా ఉన్నంతవరకు బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపు ఉండదని తెగేసి చెప్పారు. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి సైతం ఇదే విషయం ప్రస్తావించారు. అయితే బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపును బన్నీని చూసి ఇవ్వలేదనే విషయాన్ని గ్రహించాలి. ప్రభుత్వాల దగ్గరకు వెళ్లి నిర్మాతలు సాధించుకున్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తెలుగు చిత్ర పరిశ్రమకు భారీ నష్టాన్ని మిగిల్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్క బన్నీ యాటిట్యూట్ వలన తెలంగాణలో ఉన్న టాలీవుడ్ పరిశ్రమ నష్టపోయే పరిస్థితిలో ఉందని అంటున్నారు.