ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) పుష్ప 2 తర్వాత ఆల్రెడీ త్రివిక్రం తో ఒక సినిమా అనౌన్స్ చేశాడు. యానిమల్ డైరెక్టర్ సందీప్ వంగ తో కూడా సినిమా లైన్ లో ఉంది. పుష్ప 2 పూర్తి కాగానే త్రివిక్రం తో సినిమా చేస్తాడని అనుకున్నారు. కానీ మధ్యలో తమిళ్ దర్శకుడు అట్లీతో సినిమా ప్లానింగ్ లో ఉన్నాడట అల్లు అర్జున్. విజయ్ తో వరుస సినిమాలు చేసి సక్సెస్ అందుకున్న అట్లీ షారుఖ్ ఖాన్ తో జవాన్ సినిమా తీసి సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు.
జవాన్ తో పాన్ ఇండియా డైరెక్టర్ గా క్రేజ్ తెచ్చుకున్న అట్లీ నెక్స్ట్ సినిమా అల్లు అర్జున్ అయితేనే పర్ఫెక్ట్ అని భావిస్తున్నాడట. బన్నీ కూడా అట్లీతో సినిమాకు ఆసక్తి చూపిస్తున్నాడని తెలుస్తుంది. అల్లు అర్జున్, అట్లీ ఈ కాంబో నిజంగానే ఫ్యాన్స్ కి సూపర్ ఫీస్ట్ అందిస్తుందని చెప్పొచ్చు.
అట్లీ తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రం, సందీప్ వంగ తో సినిమాలు చేయనున్నాడు. పుష్ప 2 కూడా ఆశించిన రేంజ్ లో ఉంటే అల్లు అర్జున్ చేసే నెక్స్ట్ సినిమాలు కూడా భారీ స్కేల్ తో వస్తాయని చెప్పొచ్చు. ఇప్పటివరకు అయితే బన్నీ ప్లానింగ్ మాత్రం అదుర్స్ అనిపిస్తుందని చెప్పొచ్చు.
Also Read : Manchu Manoj : యువ హీరోకి విలన్ అవుతున్న మంచు మనోజ్..?
We’re now on WhatsApp : Click to Join