Site icon HashtagU Telugu

Pushpa: ‘డెల్టా అయినా ఒమిక్రాన్‌ అయినా.. మాస్క్‌ తీసేదేలే’

Pushpa Raj

Pushpa Raj

ఏదైనా విషయం గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలంటే.. పేపర్ ప్రకటననో, సోషల్ మీడియాలో ఓ పోస్టు పెడితేనో సరిపోదు.. కాస్త డిఫరెంట్ గా, అట్రాక్టివ్ గా, సిట్చుయేషన్ తగ్గట్టుగా చెబితేనే ఎక్కుతుంది. అందుకే ఈ మధ్య ట్రాఫిక్ పోలీసులతో సహ వ్యాపార సంస్థలు కూడా డిఫరెంట్ ప్రచారానికి తెరలేపాయి. ఈ జాబితాలో కేంద్ర సమాచార, మంత్రిత్వ శాఖ కూడా చేరిపోయింది. కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించేలా పుష్ప సినిమాలోని తగ్గేదేలా అనే డైలాగ్ వాడుతూ.. అల్లు అర్జున్ ఫొటో వాడేసింది. ఇప్పుడు ఈ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పుష్ప.. పుష్పరాజ్ మాస్క్ తీసేదేలే.. అంటూ ఫ్యాన్స్ కూడా సంబరపడుతూ మాస్కులు ధరిస్తున్నారు.

‘‘పుష్ప.. పుష్పరాజ్‌.. ఎవరైనా..! కొవిడ్‌పై మన పోరు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నాలుగు విషయాలను ఎప్పటికీ మర్చిపోవద్దనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది. 1. ఎల్లప్పుడూ మాస్క్‌ ధరించాలి. 2. తరచూ చేతులను శానిటైజర్‌తో శుభ్రపర్చుకోవాలి. 3. భౌతిక దూరాన్ని పాటించాలి. 4. తప్పనిసరిగా వ్యాక్సిన్‌ వేయించుకోవాలి అంటూ ప్రధాన విషయాల గురించి అవగాహన కల్పిస్తోంది కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ.

టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా సంచలన విజయం నమోదు చేసింది. 2021లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు నెలకొల్పింది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా పుష్ప సినిమా ఓ ఊపు ఊపుతోంది. అమెజాన్ ఫ్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్నా.. నేటికీ థియేటర్లలో సందడి చేస్తూనే ఉంది. ఇక అమూల్ వ్యాపార సంస్థ కూడా పుష్ప ను కార్టూన్స్ వాడి ఆశ్చర్చపర్చింది.