Rishab Shetty: పొలిటికల్ ఎంట్రీ పై రిషభ్ శెట్టి రియాక్షన్ ఇదే!

రాజకీయ ప్రవేశంపై కాంతార హీరో రిషభ్ శెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Published By: HashtagU Telugu Desk
Kantara Chapter 1

Kantara Chapter 1

కన్నడ మూవీ కాంతార దేశవ్యాప్తంగా సంచలన విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. కాంతార సినిమాతో పాటు అందులో నటించిన హీరో రిషభ్ శెట్టికి అంతకంటే ప్రశంసలు దక్కాయి. అయితే సినిమాల్లో ఒకటి రెండు గట్టి హిట్స్ కొడితే చాలామంది రాజకీయాలవైపు ద్రుష్టి సారించడం కామన్. ఈ నేపథ్యంలో రాజకీయ ప్రవేశంపై రిషభ్ శెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం తన ద్రుష్టంతా సినిమానేనని, రాజకీయాల్లోకి రావడం లేదని స్పష్టం చేశాడు. తాను రాజకీయాల్లోకి వస్తున్నానంటూ ఓ జర్నలిస్టు చేసిన ట్వీట్‌పై రిషబ్ శెట్టి స్పందిస్తూ.. దయచేసి ఇది తప్పుడు వార్త అని చెప్పండి. ఈరోజు ఏప్రిల్ 1 అని స్పష్టంగా చెప్పండి.. “ఇప్పటికే కొంతమంది నన్ను ఫలానా పార్టీకి మద్దతుదారుగా ప్రొజెక్ట్ చేశారు. నేను రాజకీయాల్లోకి వెళ్లను” అని రిషభ్ క్లారిటీ ఇచ్చారు. కాంతారా సినిమా విడుదలైన తర్వాత ఆయన ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరతారని పుకార్లు వ్యాపించాయి. అయితే, రిషబ్ శెట్టి అన్ని పుకార్లకు చెక్ పెట్టారు.

  Last Updated: 01 Apr 2023, 08:43 PM IST