Site icon HashtagU Telugu

Prabhas and Kriti Sanon: ప్రభాస్ ను పెళ్లి చేసుకుంటా.. కృతి సనన్ షాకింగ్ కామెంట్స్

Kriti

Kriti

ప్రస్తుతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్-ఇండియన్ చిత్రాల్లో ఆదిపురుష్‌ ఒకటి. ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డడానికి కారణం ప్రభాస్, కృతి సనన్ కూడా కారణం. ఈ సినిమాపై ఆది నుంచి ఎన్ని విమర్శలు వినిపిస్తున్నాయో, అంతకుమించి రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని బాలీవుడ్ టాక్. ట్రైలర్ లాంచ్‌లో వారి కెమిస్ట్రీ అందర్నీ ఆకర్షించడంతో డేటింగ్ చేస్తున్నారనే రూమర్స్ వినిపించాయి. ఇప్పుడు మరోసారి ప్రభాస్, కృతి సనన్ ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్నారు.

కృతి సనన్ ప్రస్తుతం హిందీ చిత్రం భేదియాను ప్రమోట్ చేస్తోంది. ఇంటర్వ్యూలో ఆమె ప్రభాస్ గురించి ప్రస్తావించడం అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ఓ ఇంటర్వ్యూలో తనకు ఎప్పుడైనా అవకాశం వస్తే ప్రభాస్‌ను పెళ్లి చేసుకుంటానని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. అభిమానులు ఈ క్లిప్‌ను ట్విట్టర్‌లో షేర్ చేశారు.

ఆదిపురుష్‌లో ప్రభాస్ తనకు తెలుగు టీచర్‌గా మారాడని కృతి సనన్ వెల్లడించినట్లు వీడియో చూడొచ్చు. డార్లింగ్ అభిమానులు ఈ వీడియోలను చూసి ఆశ్చర్యపోతున్నారు. డేటింగ్ పుకార్లు నిజమవుతాయని ఆశిస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో ప్రభాస్ ఫ్యాన్స్ వదినా అంటూ బాలీవుడ్ హీరోయిన్ నుద్దేశించి కామెంట్స్ చేస్తున్నారు.   మరొక వీడియోలో సహనటుడు వరుణ్ ధావన్ పై ఆసక్తికర కామెంట్స్ చేసింది.

Exit mobile version