Annamayya : ‘అన్నమయ్య’ లాంటి సినిమా చేయాలని ఉంది – నాగచైతన్య

Annamayya : ప్రస్తుతం నాగచైతన్య ‘విరూపాక్ష’ చిత్రానికి దర్శకుడిగా పేరుపొందిన కార్తీక్ దండాతో కలిసి కొత్త సినిమా చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌లోకి పెద్ద అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి ‘వృషకర్మ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

Published By: HashtagU Telugu Desk
Naga Chaitanya Annamayya

Naga Chaitanya Annamayya

హీరో నాగచైతన్య అన్నమయ్య, శ్రీ రామదాసు వంటి భక్తి రస చిత్రాలు చేయాలని ఉందని ఇటీవల ఒక టీవీ షోలో తెలిపారు. నాగార్జున నటించిన ‘నిన్నే పెళ్లాడతా’ , వెంకటేశ్ నటించిన ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ చిత్రాలను తాను ఇప్పటికీ విసుగు లేకుండా వందసార్లు చూస్తానని కూడా చెప్పారు. ఈ వ్యాఖ్యలతో ఆయన తన సినిమా అభిరుచిని, క్లాసికల్, ఫ్యామిలీ డ్రామా చిత్రాలపై ఉన్న ఆకర్షణను బహిర్గతం చేశారు.

Donald Trump : హమాస్తో సానుకూల చర్చలు జరిగాయి – ట్రంప్

ప్రస్తుతం నాగచైతన్య ‘విరూపాక్ష’ చిత్రానికి దర్శకుడిగా పేరుపొందిన కార్తీక్ దండాతో కలిసి కొత్త సినిమా చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌లోకి పెద్ద అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి ‘వృషకర్మ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. టైటిల్‌ చూస్తే ఇది పౌరాణిక, సైంటిఫిక్ లేదా సస్పెన్స్ ఎలిమెంట్స్ మిళితమై ఉండే కథ అయి ఉండొచ్చని అభిమానులు ఊహిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగా వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. నాగచైతన్య కెరీర్‌లో కొత్త మలుపు తిప్పే రకమైన కథాంశం ఉండొచ్చని టాక్ వినిపిస్తోంది. అన్నమయ్య, శ్రీరామదాసు తరహా పాత్రలపై ఆసక్తి వ్యక్తం చేసిన నాగచైతన్య ‘వృషకర్మ’ ద్వారా ప్రేక్షకులకు కొత్త కోణాన్ని చూపించబోతున్నారా అన్న ఆసక్తి అభిమానుల్లో పెరుగుతోంది.

  Last Updated: 06 Oct 2025, 09:46 AM IST