Site icon HashtagU Telugu

Milky Beauty Dream: ఆ బాలీవుడ్ హీరోతో నటించాలనుంది: మిల్కీబ్యూటీ డ్రీమ్!

Tamannaah

Tamannaah

మిల్కీ బ్యూటీ ముంబై భామ తమన్నా భాటియా తెలుగు, హిందీ సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉంది. ప్లాన్ ఏ ప్లాన్ బీ, భోళా శంక‌ర్‌, భోలే చుడియాన్‌తోపాటు ‘బ‌బ్లీ బౌన్స‌ర్’ చిత్రంలో లీడ్ రోల్‌లో న‌టిస్తోంది. తొలి మ‌హిళా బౌన్సర్ జీవిత క‌థ ఆధారంగా ‘ బ‌బ్లీ బౌన్స‌ర్’ తెర‌కెక్కుతోంది. బ‌బ్లీ బౌన్సర్‌ను ఈ నెల 23 నుంచి హాట్ స్టార్ లో ప్రదర్శించనున్నారు. ఈ చిత్రం ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉన్న తమన్నాను ఏ హీరోతో మళ్లీ నటించాలని ఉందని విలేకరులు ప్రశ్నించారు. దానికి మిల్కీ బ్యూటీ తన మనసులోని మాటను బయట పెట్టింది. సైఫ్ అలీఖాన్‌ తో క‌లిసి న‌టించాల‌ని ఉంద‌ని చెప్పింది. 2014లో వ‌చ్చిన హమ్‌షాకల్స్ లో సైఫ్ అలీఖాన్‌, త‌మ‌న్నా కలిసి నటించారు.

తమన్నా స‌త్య‌దేవ్‌తో క‌లిసి న‌టిస్తోన్న గుర్తుందా షూటింగ్ పూర్తి చేసుకుంది. మేఘా ఆకాశ్‌, సుహాసిని మ‌ణిర‌త్నం, కావ్యాశెట్టి ప్రధాన పాత్రల్లో న‌టిస్తున్న ఈ సినిమా కూడాఈ నెల 23న‌ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అయితే, ఈ తేదిని అధికారికంగా ప్రకటించవలసి ఉంది. తమన్నా మొదటి తెలుగు వెబ్ సిరీస్ ‘11త్ అవర్’ మళ్ళీ వార్తల్లోకి ఎక్కింది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ఏప్రిల్ 2021లో ఆహాలో విడుదలైంది. ఇప్పుడు ఈ సిరీస్‌ని తమిళంలోకి డబ్ చేయనున్నారు. ఈ వెబ్ సిరీస్ లో ఆదిత్, అరుణ్, వంశీకృష్ణ, శత్రు తదితరులు ప్రధాన భూమికల్లో నటించారు.

Exit mobile version