టెలివిజన్ యాంకర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన అనసూయ (Anasuya), తన గ్లామర్, టాలెంట్‌తో చిన్నపాటి స్క్రీన్‌ను బిగ్ స్క్రీన్‌గా మార్చుకుంటూ దూసుకెళ్తోంది. జబర్దస్త్ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఆమె, రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రతో ప్రేక్షకుల మనసులను దోచుకుంది. ఆ సినిమాతో ఆమెకు నటిగా మంచి క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత పుష్ప, క్షణం, కథనం, విమానం వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా మారిపోయింది.
NTR – Rajamouli : మరోసారి రాజమౌళి – ఎన్టీఆర్ కాంబో ?
వయస్సు 39 అయినా యువ హీరోయిన్లకు పోటీనివ్వగల స్థాయిలో ఉన్న అనసూయ సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ కలిగి ఉంది. ఆమె పోస్ట్ చేసే గ్లామర్ ఫోటోలు తరచూ వైరల్ అవుతుంటాయి. అయితే ఇటీవల బీచ్‌లో బికినీ ఫొటోలు షేర్ చేయడంతో నెటిజన్ల విమర్శలు ఎదుర్కొనాల్సి వచ్చింది. కానీ వారికి ధీటుగా సమాధానం చెప్పిన అనసూయ, తన అభిరుచి ప్రకారమే బతుకుతానని స్పష్టం చేసింది. ఆమె బోల్డ్ అటిట్యూడ్‌కి సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తోంది.
ఇటీవల అనసూయ ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్నాయి. ఒకవేళ పెళ్లి కాకపోయి ఉంటే ఏ హీరోతో డేటింగ్ (Anasuya Dating) చేస్తావు అని అడిగిన ప్రశ్నకు ధైర్యంగా సమాధానం చెప్పింది అనసూయ. నాకు పెళ్లి కాకపోయి ఉంటే మెగా హీరో రామ్ చరణ్(Ram Charan)తో డేటింగ్ చేసేదాన్ని అని సమాధానంగా ఇచ్చింది అనసూయ. ప్రస్తుతం అనసూయ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.