Salman Khan: జైలులో నా బాత్‌రూమ్‌ ను నేనే శుభ్రం చేసుకునేవాడ్ని, సల్మాన్ కామెంట్స్ వైరల్!

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. తన బాత్ రూమ్ ను తానే క్లీన్ చేసుకునేవాడినని చెప్పారు.

Published By: HashtagU Telugu Desk
Salman Khan Rib Injury

Salman Khan Rib Injury

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హిందీ బిగ్ బాస్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ షోను ముందుండి నడిపించింనందుకు గానూ ఆయన కళ్లు చెదిరే రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు వార్తలొచ్చాయి. తాజాగా ఈ స్టార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బిగ్ బాస్ OTT 2 లో బిగ్ బాస్ హౌస్ లోపల బాత్రూమ్‌లను శుభ్రంగా ఉంచినందుకు పోటీదారులందరినీ సల్మాన్ ఖాన్ ప్రశంసించాడు. బోర్డింగ్‌ స్కూల్‌లో చదివే రోజుల నుంచి తన పనులన్నీ తానే చేసుకునే అలవాటు ఉండేదని చెప్పాడు. దీనితో పాటు, సల్మాన్ జైలు రోజుల్లో కూడా తన బాత్‌రూమ్‌ను తానే శుభ్రం చేసుకునేవాడినని చెప్పాడు.

బిగ్ బాస్ OTT 2లో ఉన్నంత శుభ్రంగా బిగ్ బాస్ హౌస్‌లోని బాత్రూమ్ ఎప్పుడూ కనిపించలేదని సల్మాన్ చెప్పాడు. దానిని శుభ్రంగా ఉంచినందుకు కంటెస్టెంట్ పూజా భట్‌ని ప్రశంసించాడు, నేను బోర్డింగ్ స్కూల్‌లో ఉన్నప్పుడు బాత్‌రూమ్‌లను శుభ్రం చేశాను. జైలులో కూడా చేయడం అలవాటు చేసుకున్నాను అని ఈ సందర్భంగా సల్మాన్ అన్నాడు.  గ్రాండ్ ఫినాలే నటులు ఆయుష్మాన్ ఖురానా, అనన్య పాండే తమ రాబోయే చిత్రం డ్రీమ్ గర్ల్ 2 ప్రమోషన్ కార్యక్రమంలోనూ సల్మాన్ పాల్గొన్నాడు.

మీ విజయం వెనుక ఎంత మంది మహిళలు ఉన్నారు? అని వారు సల్మాన్‌ను అడిగారు. భాయిజాన్ సమాధానం చెప్పేలోపు, ఆయుష్మాన్ ఇలా అన్నాడు – ఎంతమంది డ్రీమ్ గర్ల్స్? అని ప్రశ్నించగా, సల్మాన్ రియాక్ట్ అయ్యాడు. ‘నలుగురు మహిళలు.. ఇద్దరు తల్లులు, ఇద్దరు సోదరీమణులు అని సమాధానం ఇచ్చాడు. 2 నెలల పాటు నిరంతరాయంగా అలరించిన బిగ్ బాస్ OTT 2 నిన్నటితో ముగిసింది. దీంతో హర్యానాకు చెందిన యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ ఈ సీజన్ ట్రోఫీని గెలుచుకున్నాడు. యూట్యూబర్ అభిషేక్ మల్హన్ షో రన్నరప్‌గా నిలిచాడు. మనీషా రాణి మూడో స్థానంలో నిలవగా, పూజా భట్ నాలుగో స్థానంలో, బాబికా ధూర్వే ఐదో స్థానంలో నిలిచారు.

Also Read: Rythu Bima Scheme: రైతు బీమా పథకానికి నేటితో ఐదేండ్లు పూర్తి

  Last Updated: 15 Aug 2023, 03:23 PM IST