Kangana Ranaut: హీరోల రూమ్స్ కు వెళ్లేందుకు ‘నో’ చెప్పాను : కంగనా

ఇటీవలే ట్విట్టర్ లో ఎంట్రీ ఇచ్చిన కంగనా పలు విషయాల గురించి ప్రస్తావిస్తూ ప్రతినిత్యం వార్తల్లోకెక్కుతోంది.

Published By: HashtagU Telugu Desk
Kangana ranaut bollywood

Kangana

కంగనా రనౌత్ (Kangana Ranaut).. సినిమాల్లోనే కాదు.. సోషల్ మీడియాలో బాగా వినిపించే పేరు. నిత్యం ఏదో ఒక టాపిక్ గురించి ఘాటుగా స్పందిస్తూ హాట్ టాపిక్ గా మారుతుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటూ బాలీవుడ్ (Bollywood) క్వీన్ కాంట్రావర్సీ క్వీన్ గా మారిపోయింది. ఇటీవలే ట్విట్టర్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ పలు విషయాల గురించి ప్రస్తావిస్తూ ప్రతినిత్యం వార్తల్లోకెక్కుతోంది. తాజాగా తన తల్లికి గురించి చెబుతూ ఆసక్తికరమైన ట్వీట్ (Tweet) చేశారు. కంగనా తల్లి బాలీవుడ్ హీరోయిన్ కు తల్లి అయినప్పటికీ నేటికీ వ్యవసాయం చేస్తూ తన అభిరుచిని చాటుకుంటోంది.

ఇదే విషయమై కంగనా (Kangana Ranaut) రియాక్ట్ అయ్యారు. “దయచేసి గమనించండి నా వల్ల నా తల్లి ధనవంతురాలు కాదు. నేను వ్యాపారవేత్తల కుటుంబం నుండి వచ్చాను. అమ్మ 25 ఏళ్లకు పైగా టీచర్‌గా పనిచేస్తోంది. నేను హీరోయిన్ గా కొనసాగుతున్నందనే ఆమె ధనవంతురాలు కాలేదు. బాలీవుడ్ అనేది ఓ మాఫియా. నేను ఇతర అమ్మాయిలలాగా ముసిముసి నవ్వులు నవ్వకపోవడం, ఐటెం సాంగ్స్ చేయకపోవడం, పెళ్లిళ్లలో డ్యాన్స్ చేయకపోవడం, రాత్రిపూట హీరోల గదులకు వెళ్లేందుకు నో చెప్పడం వల్లనే పిచ్చిది అనే ముద్ర వేసి జైలుకు పంపేందుకు కుట్రలు చేశారు’’ అని నటి కంగనా ఆరోపించింది.

పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నప్పటికీ, నన్ను మెరుగుపరచడానికి ప్రయత్నిస్తున్నా. కానీ విషయం ఏమిటంటే నేను నా కోసం ఏమీ కోరుకోవడం లేదు అని కంగనా అన్నారు. నేను సినిమాలు చేయడానికి చాలా ఆస్తులు అమ్మాల్సి వచ్చింది అంటూ రియాక్ట్ అయ్యింది. అయితే కంగనా బాలీవుడ్‌లో ‘మాఫియా’ అని పిలిచే వ్యక్తులను లక్ష్యంగా చేసుకుంది. పరిశ్రమలో ‘బయటి వ్యక్తులను’ అభివృద్ధి చేయనివ్వకుండా, సినిమా కుటుంబాలకు చెందిన వ్యక్తులను మాత్రమే ప్రోత్సహించే వ్యక్తులు, సమూహాలు ఉన్నాయని కంగనా (Kangana Ranaut) ఘాటుగా ఆరోపించింది.

Also Read: Ragging: ర్యాగింగ్ భూతానికి మరో విద్యార్థిని బలి!

  Last Updated: 27 Feb 2023, 04:35 PM IST