Muttaiah Muralidharan : శ్రీలంక మాజీ క్రికెటర్ కి నాని సినిమాలంటే ఇష్టమట..!

శ్రీలంక మాజీ క్రికెటర్ మణికట్టు మాయాజాలంతో వందల వికెట్లు తీసిన స్పిన్నర్ ముత్తయ్య మురళీదరణ్ (Muttaiah Muralidharan) జీవిత కథతో 800

Published By: HashtagU Telugu Desk
I Like To Watching Nani Mov

I Like To Watching Nani Mov

శ్రీలంక మాజీ క్రికెటర్ మణికట్టు మాయాజాలంతో వందల వికెట్లు తీసిన స్పిన్నర్ ముత్తయ్య మురళీదరణ్ (Muttaiah Muralidharan) జీవిత కథతో 800 సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా ముత్తయ్య కూడా ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. తెలుగులో కూడా 800 భారీగా రిలీజ్ అవుతున్న సందర్భంగా ఇక్కడ కూడా ఇంటర్వ్యూస్ ఇచ్చారు ముత్తయ్య మురళీధరణ్. శ్రీలంకలో సినీ ప్రియులు ఎక్కువమంది అని అయితే అక్కడ తమిళ, హిందీ సినిమాలే వస్తాయని అన్నారు.

హిందీలో ఎక్కువ సినిమాలు చూస్తారని అయితే తెలుగు సినిమాలు అక్కడ తమిళంలో డబ్ అయ్యి వస్తాయని అక్కడ తెలుగు సినిమాల తమిళ వెర్షన్ చూస్తామని అన్నారు. తెలుగు హీరోల్లో ఎక్కువగా నాని సినిమాలు చూస్తానని.. నాని (Nani) నటించిన ఈగ, జెర్సీ, శ్యామ్ సింగ రాయ్ సినిమాలు చూశానని అన్నారు ముత్తయ్య మురళీధరణ్. తెలుగులో చాలామంది హీరోలు ఇక్కడ సినిమాను ఆదరించే ప్రేక్షకులు ఎక్కువమంది ఉంటారని ఆయన అన్నారు.

బాహుబలి, RRR సినిమాలు కూడా తాను చూసి ఎంజాయ్ చేశానని చెప్పారు ముత్తయ్య. ప్రత్యక్షంగా తెలుగులో చూడకపోయినా తెలుగు సినిమాల తమిళ, హిందీ డబ్బింగ్ తో తాను ఇక్కడ సినిమాలను చూడగలిగానని అన్నారు. శ్రీలంకలో డైరెక్ట్ గా తెలుగు సినిమాలు రిలీజ్ అవ్వవు కానీ పాన్ ఇండియా రిలీజ్ అయ్యే సినిమాఉ వస్తాయని అన్నారు.

800 సినిమాను ఎమ్మెస్ శ్రీపతి డైరెక్ట్ చేయగా మధుర్ మిట్టల్ ముత్తయ్య (Muttaiah Muralidharan) రోల్ ని చేశారు. ఈ సినిమాలో ఎక్కువ శాతం తన ఆన్ క్రికెటర్ జర్నీని చూపించారని సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని అన్నారు ముత్తయ్య మురళీధరణ్.

Also Read : Sudheer Babu : మహేష్ ని కంగారు పెట్టించిన సుధీర్ బాబు.. ఏం జరిగిందంటే..!

  Last Updated: 27 Sep 2023, 08:15 PM IST