Site icon HashtagU Telugu

Janhvi Kapoor: అమ్మ రీమేక్స్ మూవీల్లో నటించే ధైర్యం లేదు!

Janhvy

Janhvy

జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన ‘గుడ్ లక్’ ‘సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో జాన్వీ డ్రగ్స్ సప్లయ్ చేసే అమ్మాయి పాత్రలో నటించింది. తమిళ ఒరిజినల్ కోలమావు కోకిలలో సినిమా ఆధారంగా తెరకెక్కింది.  కోలమావు కోకిల చిత్రంలో నయనతార పాత్రను ఓన్ చేసుకోవడానికి సవాలుగా తీసుకున్నా. కానీ నేను దానిని ఆస్వాదించాను అని జాన్వీ చెప్పింది. ప్రతి పాత్రలోనూ ఏదో ఒక కొత్తదనం ఉత్సాహం ఇస్తుందన్నారు. నా దర్శకుడు సిద్ధార్థ్ సేన్‌గుప్తా వీలైనంత సహజంగా నటించుందకు ప్రాముఖ్యతనిచ్చాడు అని చెప్పింది.

నా సహనటులు, నా పాత్ర యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడానికి సహాయం చేసారు. అందుకే సెట్‌లో చాలా రిలాక్స్‌గా ఉన్నాను అని షూటింగ్ మెమోరీస్ ను గుర్తుచేసుకుంది జాన్వీ. ‘‘మీరు మీ తల్లి శ్రీదేవి మూవీస్ నుంచి ఏదైనా చిత్రాన్ని రిమేక్ చేస్తే.. ఏ మూవీని సెలక్ట్ చేసుకుంటారు? అని మీడియా జాన్వీ ప్రశ్నించగా.. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. తన సహజ పాత్రలతో బాలీవుడ్ పై తనదైన ముద్రవేసింది. సో మా అమ్మ రిమేక్ మూవీస్ లో నటించే ధైర్యం నాకు లేదు అని స్పష్టం చేసింది.

Exit mobile version