Samantha Ruth Prabhu : హీరోలతో సమానంగా హీరోయిన్లకు పారితోషికం చెల్లించాలన్న డిమాండ్ పై ప్రముఖ నటి సమంత స్పందించింది. వారే ఇష్టపూర్వకంగా మహిళలకు చెల్లించాలి కానీ, అందుకోసం అడుక్కో కూడదన్న అభిప్రాయాన్ని తనకు లేదని సమంత వ్యక్తం చేసింది. పింక్ విల్లా అనే మీడియా సంస్థతో సమంత మాట్లాడింది.
‘‘నేను చాలా గట్టిగా పోరాడుతున్నాను. కానీ డైరెక్ట్ గా కాదు. వారితో సమాన పారితోషికం చెల్లింపుల కోసం నేను పోరాడడం లేదు. కష్టపడడానికి, విజయానికి ఉప ఉత్పత్తి సినిమా కావాలని కోరుకుంటున్నాను. మీకు ఇంత మొత్తం చెల్లిస్తామంటూ వారు వచ్చి చెబుతుంటారు. అంతేకానీ, ఇంత ఇవ్వాలని ఎప్పుడు నేనేమీ అభ్యర్థించను. ఇది అద్భుతమైన కృషితో వస్తుందని నేను నమ్ముతాను’’ అని సమంతా (Samantha Ruth Prabhu) చెప్పింది. మీ సామర్థ్యాలను మన పరిమితి మేరకు, అంతకంటే కొంచెం ఎక్కువే వెలికితీయడానికే ప్రయత్నం చేయాలని కొటేషన్ రాసుకుంటానని తెలిపింది. పరిమితికి మించి సామర్థ్యాలన్నవి మరింత కష్టపడడం ద్వారానే వస్తుందని సంత్ తెలిపింది.
Also Read: Miracle in the Sky: ఈ రోజు రాత్రికి ఆకాశంలో అద్భుతం..