Site icon HashtagU Telugu

Aamani: నటి ఆమని సంచలన వ్యాఖ్యలు.. డబ్బు కోసం సినిమాల్లోకి రాలేదు

Aamani

Aamani

తెలుగులో స్కిన్ షో చేయకుండా హీరోయిన్ గా ఎదిగిన అతికొద్ది మందిలో ఆమని (Aamani) ఒకరుగా కనిపిస్తారు. తెలుగులో కె. విశ్వనాథ్ .. బాపు వంటి గొప్ప దర్శకులతో కలిసి పనిచేసిన ఘనత ఆమె సొంతం. అలాంటి ఆమని తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. ” ఒక మంచి సమయంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడమే నేను చేసుకున్న అదృష్టం” అని అన్నారు.

“నేను .. రోజా .. రమ్యకృష్ణ .. సౌందర్య చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్లం. నా సినిమాలు చూసి వాళ్లంతా అభినందించేవారు. మా మధ్యలో ఎలాంటి ఇగో ప్రొబ్లెమ్స్ ఉండేవి కాదు. ‘మిస్టర్ పెళ్లాం’ నాకు అవార్డును తెచ్చిపెడుతుందనిగానీ, ‘శుభ సంకల్పం’లో కమల్ గారి సరసన నటిస్తానని గాని నేను ఎప్పుడూ అనుకోలేదు” అని చెప్పారు.

Also Read: Delhi Airport : ప్లీన‌రీకి వెళ్లే లీడ‌ర్ల‌పై పోలీసింగ్‌, విమానం నుంచి ప‌వ‌న్ దించివేత‌!

” నేను ఎప్పుడూ కూడా కథ ఏమిటని గానీ .. ఎంత ఇస్తారని గాని అడగలేదు. నాకు ఎలాంటి పాత్రలు ఇవ్వాలనేది .. ఎంత ఇవ్వాలనేది మేకర్స్ కి తెలుసు. అందువలన నేను ఎప్పుడూ వాటిని గురించి ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు. హీరోయిన్ గా మంచి పాత్రలు చేయాలి .. మంచి పేరు తెచ్చుకోవాలి అనే ఉద్దేశంతోనే నేను ముందుకు వెళ్లాను” అని చెప్పుకొచ్చారు.