Viral Talk : దివంగత లెజెండరీ సింగర్ స్వర్ణలత అలనాడు పాడిన పాటలు నేటికీ సినీప్రియుల మదిలో పదిలంగా నిలిచి ఉన్నాయి. ‘‘కొత్త పెళ్లికూతురా రారా’’.. ‘‘ఓహో బావా.. మార్చుకో నీ వంకర టింకర దోవ’’.. ‘‘కాశీకి పోయాను రామా హరి’’.. వంటి హిట్ హాస్య పాటలను పాడింది మరెవరో కాదు స్వర్ణలతే. ఎనిమిది భాషల్లో ఆమె పాటలు పాడారు. 30 సినిమాల్లో నటించారు. స్వర్ణలత పెద్ద కుమారుడు ఆనంద్ రాజ్‌ను మనం చాలా సినిమాల్లో విలన్ పాత్రలో చూశాం. స్వర్ణలత ఏడుగురు సంతానం డాక్టర్స్ అయ్యారు. ఆమె చిన్న కుమారుడు, డ్యాన్స్ మాస్టర్ అనిల్ రాజు తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. అవేంటో తెలుసుకుందాం..
Also Read :Nara Lokesh: బ్రాహ్మణికి ఇంకో కొడుకును నేనే.. నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు
హిజ్రా లక్షణాలు తగ్గిపోయి..
సింగర్ స్వర్ణలత చిన్న కుమారుడు అనిల్ రాజు.. డ్యాన్స్ మాస్టర్‌గా సినీ ఇండస్ట్రీలో చాలామందికి పరిచయం. అయితే 16 ఏళ్ల ఏజ్‌కు రాగానే ఆయనలో ఆడ లక్షణాలు బయటపడ్డాయి. అసలు విషయమేంటో తల్లి స్వర్ణలత వెంటనే అర్థం చేసుకున్నారు. తన చీరలు కట్టుకొమ్మని అనిల్‌కు సూచించారు. తాను చనిపోయేవరకు తన దగ్గరే ఉండిపోమన్నారు. అయితే అన్నయ్య ఆనంద్ రాజ్‌కు మాత్రం అనిల్ రాజు హిజ్రాలా మసులుకోవడం నచ్చేది కాదు. అన్నదమ్ములు ఎవ్వరూ అనిల్‌తో మాట్లాడేవారు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. అనిల్ రాజులో ఇప్పుడు పెను మార్పు వచ్చింది. ఆయనలోని హిజ్రా లక్షణాలు తగ్గిపోయాయి.
Also Read :Hair Transplant Capital : బట్ట తలలకు చికిత్స.. ఆ దేశమే నంబర్ 1
దొంగలు కారును చుట్టుముట్టి..
1997న మార్చి 5న ఓ కీలక ఘటన జరిగింది. అనిల్ రాజు, తల్లి స్వర్ణలత చెన్నై నుంచి హైదరాబాద్‌కు వస్తున్నారు. ఆ టైంలో స్వర్ణలత ఒంటిపై రూ.4.50 లక్షలు విలువైన బంగారు నగలు ఉన్నాయి. చిన్నవంగల్ గ్రామానికి కారు చేరుకోగానే దొంగలు ఆ కారును చుట్టుముట్టారు. డ్రైవర్‌ను, అనిల్ రాజును, సింగర్ స్వర్ణలతను(Viral Talk) కొట్టారు. సింగర్ స్వర్ణలత ఐదురోజుల వరకు గాయాలతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ 1997 మార్చి 10న చనిపోయారు. తదుపరిగా తల్లి స్వర్ణలత ఉన్న ఇంటిని అమ్మేస్తే తమకు రూ.100 కోట్లు వచ్చాయని అనిల్ రాజు చెప్పారు. ఆ డబ్బులను తొమ్మిది మంది సోదరులు పంచుకున్నట్లు పేర్కొన్నారు. ఆ డబ్బుల్లోని రూ.3 కోట్లతో తల్లి స్వర్ణలత జీవితకథపై సినిమా తీస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
3 కిలోల బంగారం.. 500 పట్టుచీరలు
‘‘మా అమ్మ వెళ్లిపోతూ నాకు 3 కిలోల బంగారం ఇచ్చింది. మా అమ్మ ఇచ్చిన 500 పట్టుచీరలు నాదగ్గరే ఉన్నాయి. వాటిలో కొన్ని బంగారంతో తయారు చేసినవి. హిజ్రాగా ఉన్నప్పుడు ఆ చీరలను నేనే కట్టుకునే వాడిని’’ అని అనిల్ రాజు గుర్తు చేసుకున్నారు. ‘‘ఓసారి మా అమ్మ స్వర్ణలత ఒక ముస్లిం కుటుంబం పెళ్లికి వెళ్లింది. కట్నం ఇవ్వలేదని వరుడు పెళ్లే వద్దన్నాడు. దీంతో అక్కడే ఉన్న మా అమ్మ తన చేతికున్న 40 బంగారు గాజుల్ని ఇచ్చి, ఆ పెళ్లి జరిపించింది’’ అని ఆయన చెప్పారు.