Kota Srinivasa Rao: నేను చనిపోలేదు.. బతికే ఉన్నా: కోట క్లారిటీ

కోట శ్రీనివాస రావు(Kota Srinivasa Rao) మరణించారని వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

Published By: HashtagU Telugu Desk
Kota

Kota

టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాస రావు(Kota Srinivasa Rao) మరణించారని వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. దీంతో ఈ వార్తలపై కోట స్పందించారు. తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని ఆయనే స్వయంగా చెప్పారు. తన ఆరోగ్యం(Health) బావుందని, ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని కోట శ్రీనివాస రావు క్లారిటీ ఇచ్చారు. తప్పుడు వార్తలను ఎవ్వరూ నమ్మొద్దని కోట శ్రీనివాస రావు స్వయంగా వివరణ ఇచ్చారు. దీంతో అభిమానులంతా ఊపిరి పీల్చుకున్నారు.

టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు (Kota srinivasa Rao) గురించి తెలియని తెలుగు ప్రేక్షకులంటూ ఎవ్వరూ ఉండరు. తెలుగుతో పాటుగా ఈ దిగ్గజ నటుడు దక్షిణాదిలోని అన్ని భాషల్లోని నటించి ప్రేక్షకుల దగ్గరయ్యారు. విలక్షణ నటనతో సినీ ప్రేమికులను ఆకట్టుకున్నారు. విలన్ గా భయపెట్టడంలోనైనా, కామెడీ చేసి కడుపుబ్బా నవ్వించడంలోనైనా ఆయన నటన అద్భుతం.

  Last Updated: 21 Mar 2023, 11:33 AM IST