Site icon HashtagU Telugu

Shah Rukh Khan: అర్ధరాత్రి ఫోన్ చేసినా అందుబాటులో ఉంటా: షారుక్ ఖాన్

Shah Rukh Khan Cars

Shah Rukh Khan Cars

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ‘జవాన్’ గ్రాండ్ సక్సెస్‌తో దూసుకుపోతున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీకి మంచి బజ్ వినిపిస్తుండటంతో అన్ని చోట్లా ఊహించని కలెక్షన్స్ వస్తున్నాయి. పఠాన్ తర్వాత ఈ మూవీ కూడా సూపర్ హిట్ కొట్టడంతో షారుక్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ గానూ ఈ నటుడికి పేరుంది. ఓ ఇంటర్వ్యూలో షారుక్ తన మొబైల్ నెంబర్ రివీల్ చేసి అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చాడు. గతంలో ఇచ్చిన ఆ ఇంటర్వ్యూ వైరల్ అయ్యింది.

షారుఖ్ గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేయబడిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు. వాటిలో ఒకటి షారుఖ్ ఖాన్ మొబైల్ నంబర్. ‘అర్ధరాత్రి తర్వాత ఎప్పుడైనా కాల్ చేయండి. నేను దానిని స్వీకరిస్తాను. లేదా, మెసేజ్ పంపండి.. నేను మీకు ఎమోజీతో రిప్లై ఇస్తాను’ అనిరియాక్ట్ అయ్యాడు. షారుఖ్ తన నంబర్‌ను ‘5559960321’గా వెల్లడించాడు. ఈ వీడియోపై పలువురు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. జవాన్‌ సినిమా ఇప్పటికే జాతీయ స్థాయిలో 100 కోట్లు దాటేసింది. సినిమాకు వస్తున్న అద్భుతమైన రెస్పాన్స్‌ని చూసి నటుడు తన ట్విట్టర్ లో కృతజ్ఞతలు తెలిపాడు. జవాన్ విజయంపై షారుక్ స్పందించడం ఇది రెండోసారి.

కాగా, ‘జవాన్’ సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ మూడు భాషల్లో కలుపుకుని తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.129.6 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్మెంట్ ప్రకటించింది. ఒక బాలీవుడ్ సినిమాకు తొలిరోజు ఇదే అతిపెద్ద ఓపెనింగ్.

Also Read: Chandrababu Arrest – YCP Happy : చంద్రబాబు అరెస్ట్ ..సంబరాల్లో వైసీపీ